Home గాసిప్స్ చిరు కొరటాల…అంతా అబద్దం…అసలు నిజం ఇదే!!

చిరు కొరటాల…అంతా అబద్దం…అసలు నిజం ఇదే!!

0

    టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి 10 ఏళ్ల కి మెగా కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 రికార్డుల మ్రోత మ్రోగించగా చిరు అప్ కమింగ్ మూవీ అయినా సైరా నరసింహ రెడ్డి కోసం టోటల్ టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే, కాగా చిరు ఈ సినిమా షూటింగ్ ను ఆల్ మోస్ట్ ముగించే దశలో ఉండగా తరువాత సినిమా పై అందరి లోను కొంత గందరగోళం అయితే ఏర్పడింది.

కొరటాల తో సినిమా అనౌన్స్ చేసినా కానీ రీసెంట్ గా వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ మూవీ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడని రామ్ చరణ్ ఈ కాంబో సెట్ చేశాడని…

చెప్పిన విషయం తెలిసిందే, దాంతో ఇక కొరటాల శివ మరియు మెగాస్టార్ చిరంజీవి ల మూవీ కాన్సిల్ అయిపోయిందని, చిరు తర్వాత మూవీ త్రివిక్రమ్ తోనే అని అందరు ఫిక్స్ అయి పోతున్న తరుణం లో ఈ వాదనల కి పులిస్టాప్ పెట్టేశారు చిరు సినిమా నిర్మాతలు.

కొరటాల శివ తో చిరు మూవీ కాన్సిల్ కాలేదని, సైరా షూటింగ్ చివరి స్టేజ్ లో ఉండటం తో షూటింగ్ డిలే అయిందని కానీ త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా భారీ ఎత్తున మొదలు కాబోతుందని, నిర్మాతలు అఫీషియల్ స్టేట్ మెంట్ ని వదిలేశారు.

దాంతో వరుస బ్లాక్ బస్టర్ ల కొరటాల తో మెగాస్టార్ చిరు సినిమా కన్ఫాం అవ్వడం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది, ఇక మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here