Home న్యూస్ బాలయ్య కి చిరంజేవి-ఎన్టీఆర్ విషెస్…ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!

బాలయ్య కి చిరంజేవి-ఎన్టీఆర్ విషెస్…ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నేడు 60 వ ఏట అడుగు పెడుతూ షష్టి పూర్తీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. కానీ బర్త్ డే విషెస్ ల పరంగా రీసెంట్ టైం లో పెద్దగా విషెస్ ఓపెన్ గా సోషల్ మీడియా లో చెప్పని వారి లో ఎన్టీఆర్ కూడా ఉన్నారు, ఇది వరకు జరిగిన పరిస్థితుల వలన…

సోషల్ మీడియా లో చాలా తక్కువ సమయం లోనే ఎన్టీఆర్ బాలయ్య కి విషెస్ చెప్పగా రీసెంట్ గా పరిస్థితులు అన్నీ సద్దుమనగడంతో ఇప్పుడు ట్విట్టర్ లో బాలయ్య గురించి ఓ రేంజ్ లో చెప్పి ఎలివేట్ చేశాడు ఎన్టీఆర్.. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది…

నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! అని కామెంట్ చేశాడు ఎన్టీఆర్..

ఇక రీసెంట్ గా బాలయ్య ఓపెన్ గానే విమర్శలు చేశాడు చిరంజీవి మరియు కొందరి పై, కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా తోటి నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం లో ఏమాత్రం సంకోచించ లేదు మెగాస్టార్. రీసెంట్ గా అందరికీ విషెస్ చెబుతున్న చిరు, బాలయ్య కి చెబుతాడా లేదా అని చాలా మంది ఎదురు చూశారు, విషెస్ చెప్పి రియల్ మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరంజీవి…

60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday అని విషెస్ చెప్పాడు మెగాస్టార్. మొత్తం మీద ఈ విషెస్ తో ఫ్యాన్స్ డబుల్ ఖుషీ లో ఉన్నారని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here