టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రీ ఎంట్రీ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేయగా అందులో రెండు సినిమాలు సూపర్ సక్సెస్ లు గా నిలిస్తే…మరోటి తెలుగు వర్షన్ వరకు బాగానే వసూళ్ళని అందుకున్నా ఓవరాల్ గా 4 ఫ్లాఫ్ లు అయితే చిరు ఖాతాలో పడ్డాయి.
రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా అనేక కథలను విన్న మెగాస్టార్ వెబ్ సిరీస్ గా వచ్చి ఇండియాలో వన్ ఆఫ్ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ గా గా నిలిచి తర్వాత వరల్డ్ వైడ్ గా కూడా భారీగా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న ఒక వెబ్ సిరీస్ కి నో చెప్పినట్లు రీసెంట్ గా…
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ గారు రివీల్ చేశారు. ఇండియాని ఒక ఊపు ఊపేసిన ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ అందరికీ తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్ రాజ్ అండ్ డీకే ఈ కథని సినిమాగా తీద్దామని, చిరుకి అయితే బాగా సెట్ అవుతుందని అశ్వనీదత్ ద్వారా…
కథని చిరుకి వినిపించగా రీ ఎంట్రీ తర్వాత వెంటనే ఈ కథ, అందునా పిల్లల తండ్రి అంటే కష్టంగా ఉంటుందేమో అన్న అనుమానాలు ఉండటం తో సతమతం అవుతూ ఉండగా అశ్వనీదత్ అవసరం అయితే పిల్లల రోల్స్ ని తీసేసి ఈ కథని ఓకే చేద్దామని చెప్పినా ఎందుకో… చిరుకి కథ అంతగా…
నచ్చక పోవడంతో సినిమా అవ్వాల్సిన ఫ్యామిలీ మాన్ కథ మరింత డెవలప్ అయ్యి ఇప్పుడు వెబ్ సిరీస్ గా మోస్ట్ పాపులర్ అయిపోయింది. ఈ కథ చిరు చేసి ఉంటే బాగుండేది కానీ కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకునేదో అంచనా వేయడం కష్టమే… కానీ వెబ్ సిరీస్ గా మాత్రం ఫ్యామిలీ మాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు మూడో పార్ట్ కి సిద్ధం అవుతుంది.