మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ నంబర్ 150 తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వగా తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా అంచనాలను అందుకోలేదు. కానీ మొదటి వారం కలెక్షన్స్ పరంగా మాత్రం సైరా నరసింహా రెడ్డి మాత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోయగా ఇప్పుడు మెగాస్టార్ లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య…
సినిమా సెకెండ్ బెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది ఇప్పుడు. సైరా నరసింహా రెడ్డి సినిమా మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర 115.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా 96.46 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ తర్వాత నటించిన 5 సినిమాల మొదటి వారం సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉#WaltairVeerayya: 96.46CR(165.45CR~ Gross)***
👉#GodFather :53.10CR(96.35CR~ Gross)
👉#Acharya :47.87CR (75.05CR~ Gross
👉#SyeRaaNarasimhaReddy :115.38Cr(188.5cr Gross)
👉#KhaidiNo150 : 77.32Cr(111.50CR Gross)
ఇవీ మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి నటించిన లాస్ట్ 5 మూవీస్ ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్… ఆచార్య, గాడ్ ఫాదర్ లాంటి బాక్ టు బాక్ ఫ్లాఫ్ మూవీస్ ఎఫెక్ట్ వలన వాల్తేరు వీరయ్య ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అనుకున్నా ఏకంగా మెగాస్టార్ కెరీర్ సెకెండ్ బెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది.