ఆకాష్ పూరీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చోర్ బజార్…. రొటీన్ స్టొరీ లానే అనిపించినా మినిమమ్ కామెడీ లాంటివి ఉండే అవకాశం ఉందని టీసర్ ట్రైలర్ చూశాక అనిపించగా రీసెంట్ గా భారీగా రిలీజ్ అయిన మూవీస్ లో సమ్మతమే తర్వాత సెకెండ్ నోటబుల్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకోగా ఎంతవరకు సినిమా ఆకట్టుకుంది, ఏ మేరకు మెప్పించిందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ….
ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…చోర్ బజార్ లో ఉండే హీరో మూగ అమ్మాయి అయిన హీరోయిన్ ని లవ్ చేస్తూ ఉంటాడు. అరగంటలో ఎక్కువ కార్ల టైర్స్ విప్పి గిన్నీస్ రికార్డ్ కొట్టాలని అనుకుంటూ ఉంటాడు.. అలాంటి టైం లో ఓ 200 కోట్ల డైమండ్ చోర్ బజార్ కి వస్తుంది. తర్వాత అక్కడ ఏం జరిగింది….
ఆ డైమండ్ ని ఎవరు దొంగిలించారు…. హీరో ఇవన్నీ ఎలా సాల్వ్ చేశాడు అన్నది మొత్తం మీద స్టొరీ పాయింటి…. వినడానికి చాలా సిల్లీ పాయింట్ లానే అనిపించినా కామెడీ సరిగ్గా వర్కౌట్ అయితే బాగా ఆకట్టుకునే పాయింట్ అనే చెప్పాలి కానీ డైరెక్టర్ తెరకెక్కించిన విధానం నిరాశ పరుస్తుంది….
హీరోగా ఆకాష్ పూరీ ఆకట్టుకోగా, హీరోయిజం సీన్స్ లో కూడా మెప్పించాడు, నటన పరంగా ఇంకా మెరుగు అవ్వాల్సిన అవసరం ఉండగా హీరోయిన్ పర్వాలేదు అనిపించగా…. మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగానే ఉన్నప్పటికీ ఇంపాక్ట్ మాత్రం అనుకున్న విధంగా అయితే లేదు. సాంగ్స్ పర్వాలేదు, ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది, సినిమాటోగ్రఫీ పర్వాలేదు…
ఓవరాల్ కథ పాయింట్ నే వీక్ గా ఉండటంతో కథనం అయినా బాగుంటుంది అనుకుంటే ఏవేవో సీన్స్ ఒకదానికి ఒకటి సంభందం లేనివి వస్తూ పోతూ ఉంటాయి, హీరో ఏమో హిందీ డైలాగ్స్ కొడుతూ ఉంటాడు, సిల్లీ సీన్స్ చాలానే ఉంటాయి… మొత్తం మీద టైం పాస్ చేయాలి అనుకున్నా వాళ్ళు కొంచం ఓపిక ఎక్కు చేసుకుని చూస్తె సినిమా అతి కష్టం మీద ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు.