నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ గా వచ్చిన తెలుగు సినిమా సినిమా బండి అందరి ప్రశంసలు సొంతం చేసుకుంటుంది, సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కూడా సినిమా ఎంతో బాగుంది అంటూ మెచ్చుకుంటున్నారు. ఇలా అందరి మెప్పు పొందుతున్న సినిమా విశేషాలు తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ కి వస్తే… ఒక మారుమూల ఊరులో ఆటో తోలుకునే వ్యక్తీకి ఒకరోజు అనుకోకుండా తన ఆటోలో ఒక ఖరీదైన కెమరా పాసెంజర్ మర్చిపోవడం తో దొరుకుంది…
ఆ కెమరా తో ఏం చేద్దామని ఆలోచిస్తూ ఒక సినిమా తీద్దాం అనుకున్న ఆ వ్యక్తీ ఊరికి వచ్చి తన చుట్టూ ఉన్న వాళ్ళ తో సినిమా ప్లాన్ చేస్తాడు, మరి ఆ సినిమా ను అనుకున్నట్లు తీశాడా, తీసే క్రమం లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు అయ్యాయి. ఎలా ముగిసింది అన్నది సినిమా కథ…
కేవలం 1 గంటా 40 నిమిషాల లెంత్ మాత్రమే ఉన్న ఈ సినిమా కథ లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి పెద్దగా టైం ఏమి పట్టదు, ఇన్వాల్వ్ అయ్యాక చక చకా సాగుతున్న సినిమా ఆడియన్స్ ని చాలా సేపు చిరు నవ్వులు వచ్చేలా చేస్తుంది, రిపీటివ్ గా అనిపించే…
కొన్ని షూటింగ్ సీన్స్ బోర్ కొట్టినా షూటింగ్ టైం లో వీళ్ళు చేసే చేష్టలు చూసి ఆడియన్స్ నవ్వుకోవడం ఖాయం, చివరి 10 నిమిషాల ఎపిసోడ్ ఎమోషనల్ గా ముగిసినా మంచి ఫీల్ ఇచ్చి ఒక మంచి సినిమా చూశాం రా అన్న భావనని కలిగించడం ఖాయం. అందరూ సహజమైన నటనతో మెప్పించాగా ఎవ్వరూ ఎవరికీ తీసిపోలేదు అనే చెప్పాలి…
పాటలు సినిమాలో ఇరికించకుండా థీం సాంగ్స్ లా బాగానే ఇంప్రెస్ చేశారు, కంప్లీట్ నాచురల్ లోకేషన్స్ లో అద్బుతంగా సినిమాను తీశారు డైరెక్టర్… కేరాఫ్ కంచరపాలెం, రీసెంట్ గా ఆహ లో వచ్చిన మెయిల్ లాంటి మూవీస్ ని ఇష్టపడ్డ వాళ్ళు కచ్చితంగా ఈ సినిమా ని కూడా ఇష్టపడటం ఖాయం. ఫ్రీ టైం లో కచ్చితంగా ఈ సినిమా ను చూడండి…