Home న్యూస్ విక్రమ్ “కోబ్రా” తెలుగు బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

విక్రమ్ “కోబ్రా” తెలుగు బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో విక్రమ్ కూడా ఒకరు, శివ పుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాలతో తెలుగు లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నా కానీ అనుకున్న రేంజ్ లో హిట్స్ పడక పోవడంతో విక్రమ్ సినిమాలను లైట్ తీసుకుంటూ వస్తున్నారు ఆడియన్స్… అడపాదడపా కొన్ని పర్వాలేదు అనిపించే సినిమాలు వచ్చినా కానీ ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర…

హిట్ గీతని అయితే దాటలేదు అనే చెప్పాలి. ఐ మూవీ ఓపెనింగ్స్ అదరగొట్టినా కానీ ఫ్లాఫ్ టాక్ తో హిట్ కాలేక పోయినా కానీ ఓవరాల్ గా మాత్రం విక్రమ్ కి తెలుగు లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందించిన సినిమాగా నిలవగా…

రీసెంట్ గా విక్రమ్ నటించిన మహాన్ మూవీ డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు విక్రమ్ పలు గెటప్స్ లో కనిపిస్తూ వస్తున్న లేటెస్ట్ మూవీ కోబ్రా ఆడియన్స్ ముందుకు వినాయక చవితి కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమా తెలుగు డబ్ వర్షన్ ని…

ఉన్నంతలో భారీగానే రిలీజ్ చేస్తున్నారు, కాగా తెలుగులో ఈ సినిమా సాధించిన బిజినెస్ వర్త్ ఈ విధంగా ఉంది…
👉Nizam – 1.7Cr
👉Ceeded – 0.8Cr
👉Andhra – 2Cr
AP TG:- 4.50Cr
తెలుగు లో ఓవరాల్ గా వర్త్ బిజినెస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు హిట్ గీతని దాటాలి అంటే మినిమమ్ 5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక తమిళనాడు, వరల్డ్ వైడ్ సినిమా బిజినెస్ లెక్కలు క్లియర్ గా రిలీజ్ అవ్వలేదు కానీ ట్రేడ్ అంచనాల ప్రకారం వరల్డ్ వైడ్ బిజినెస్ 60 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అఫీషియల్ బిజినెస్ లెక్కలు వచ్చాక మరోసారి వరల్డ్ వైడ్ బిజినెస్ ను అప్ డేట్ చేస్తాం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here