Home న్యూస్ కోల్డ్ కేస్ రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

కోల్డ్ కేస్ రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

1

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ఇండియా లో చాలా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ ను నోచుకోలేక డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి. వాటిలో ఎక్కువగా కేసులు ఇప్పటికీ నమోదు అవుతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి ఎక్కువ సినిమాలు డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోగా వాటిలో పృద్వీరాజ్ నటించిన కోల్డ్ కేస్ సినిమా రీసెంట్ గా ప్రైమ్ వీడియో లో రిలీజ్ అవ్వగా తర్వాత ఈ సినిమాను…

ఆహా వీడియో వాళ్ళు తెలుగు లో డబ్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది లాంటి విశేషాలను గమనిస్తే… చేపలు పట్టడానికి వేసిన వలలో ఒక పుర్రె దొరుకుతుంది… ఆ పుర్రె ఎవరిదో తెలుసుకోవడానికి పోలిస్ అయిన హీరో ఇంటరాగేషన్ మొదలు పెట్టగా అదే టైం లో…

టీవీ రిపోర్టర్ అయిన ఓ చిన్న బిడ్డ తల్లి తన భర్తతో విడిపోయి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వగా ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉందని తెలుసుకుంటుంది… ఆ ఆత్మ ఎవరిదీ అని ఆ రిపోర్టర్ తన సైడ్ నుండి ఎంక్వైరీ మొదలు పెట్టగా చివరికి చనిపోయింది ఎవరు అని వేరు వేరుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఈ ఇద్దరు ఎలా కనిపెట్టారు అన్నది సినిమా కథ…

కథ పాయింట్ బాగానే ఉంది కానీ సినిమా చెప్పిన విధానం చాలా నెమ్మదిగా ఉంది, ఆ కేసులో ఒక్కో లీడ్ ని వెతుకుతూ కేస్ ని డెవలప్ చేస్తూ అసలు చనిపోయింది ఎవరు, ఆమెని అలా ఎవరు చెప్పారు అన్న ఆసక్తిని స్లో నరేషన్ తో చెప్పినా క్లైమాక్స్ లో ఎండింగ్ చాలా సాదాసీదాగా చెప్పేశారు… బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండటం సినిమాకి ప్లస్ పాయింట్ అవ్వగా లెంత్ ఎక్కువ అవ్వడం.

స్లో నరేషన్ లాంటివి మేజర్ మైనస్ పాయింట్స్… అయినా కానీ ఇలాంటి క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ ని ఇష్టపడే వాళ్ళు కొంచం ఓపికతో ఎవరు చంపారు అంటూ గెస్ చేసుకుంటూ సినిమాని ఒకసారి చూడొచ్చు… రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ కోసం తీసిన సినిమా అయితే కాదు ఈ సినిమా… అయినా చూడాలి అనుకుంటే కొంచం బోర్ ఫీల్ అయినా ఒకసారి చూసేలా ఉంటుంది సినిమా.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here