Home న్యూస్ డిసాస్టర్ అన్నారు….హ్యుమంగస్ రికార్డ్ కట్టబెట్టారు!

డిసాస్టర్ అన్నారు….హ్యుమంగస్ రికార్డ్ కట్టబెట్టారు!

0

క్రేజ్ ఉన్న సినిమా లు థియేటర్స్ లో రిలీజ్ అయితే హిట్ లేదా ఫ్లాఫ్ టాక్ వస్తే దాన్ని ఎలా తట్టుకుని నిలబడతాయి అన్నది ఆసక్తి కరంగా ఉంటుంది కానీ కరోనా వలన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా వాటిలో కొన్ని సినిమాలకు టాక్ బాలేకున్నా కానీ సెన్సేషనల్ వ్యూస్ తో దుమ్ము దుమారం చేసి సంచలనం సృష్టించాయి. వాటిలో ఈ ఇయర్ బాలీవుడ్ లో వచ్చిన లక్ష్మీ సినిమా…

ఇలానే దుమ్ము లేపగా ఇప్పుడు మరో సినిమా కూడా ఇలానే షాక్ ఇచ్చింది, సుశాంత్ ఫ్యాన్స్ సినిమా ను బాయికాట్ చేస్తామని చెప్పినా సాంగ్స్ కి రికార్డ్ లెవల్ వ్యూస్ దక్కగా తర్వాత సినిమా రిలీజ్ అయిన ఒరిజినల్ వర్షన్ తో పోల్చితే ఇది మినిమమ్ కూడా ఇంపాక్ట్ ని…

క్రియేట్ చేయలేక పోయింది అంటూ అందరూ కామెంట్స్ చేసినా కానీ సినిమాకి మాత్రం ఇప్పుడు మొదటి రోజు కి గాను రికార్డ్ లెవల్ వ్యూస్ దక్కాయి అని ఏకంగా అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది… వాళ్ళ ఫ్లాట్ ఫాం లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలలో సూర్య నటించిన సూరరై పొట్రు సినిమా కి…

రికార్డ్ లెవల్ వ్యూస్ దక్కాయి అని మొదటి రోజు తర్వాత అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి చెప్పగా… ఇప్పుడు ఆ రికార్డు ను సైతం డిసాస్టర్ టాక్ తో వరుణ్ ధవన్ మరియు సారా అలీ ఖాన్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ నంబర్ 1 బ్రేక్ చేసిందని అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫాం చేశారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు… ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అన్నది మాత్రం…

వెల్లడించలేదు కానీ OTT లో రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ వ్యూస్ ఈ సినిమాకే వచ్చాయి అంటూ ప్రమోషన్ లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 120 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళు చెప్పిన మాటలు నిజమా కాదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది… నిజం అయితే మట్టుకు సినిమా అంచనాలను మించేసింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here