Home న్యూస్ సోలో బ్రతుకే సో బెటర్ డే 2 స్టేటస్…హోల్డ్ చేసిందా లేదా?

సోలో బ్రతుకే సో బెటర్ డే 2 స్టేటస్…హోల్డ్ చేసిందా లేదా?

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలకు మించి కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది. సినిమా మొదటి రోజు 2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 2.91 కోట్ల షేర్ ని వసూల్ చేసి దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3.43 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమాకి మొదటి రోజు క్రిస్టమస్ హాలిడే కూడా బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి, ఇక రోజు శనివారం అవ్వడం తో సినిమా ఎలా హోల్డ్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా…

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొదటి రోజు తో పోల్చితే 30% వరకు డ్రాప్స్ ని ఎక్కువ సెంటర్స్ లో సొంతం చేసుకోగా కొన్ని సెంటర్స్ లో డ్రాప్స్ 40% వరకు ఉన్నాయి, ఇది కామన్ అనే చెప్పాలి, సినిమా ఈ డ్రాప్స్ తో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎంతవరకు కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తి గా మారగా 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటే సాలిడ్ గా హోల్డ్ చేసిందని అంచనా వేయవచ్చు అని చెప్పొచ్చు. తెలుగు సినిమా కి బిగ్ మార్కెట్ అయిన ఓవర్సీస్ లో ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం బాలేక పోవడం బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపుతుంది అని చెప్పాలి, అదే సమయం లో ఇక్కడ 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్స్ కొంచం…

ఎదురుదెబ్బ కొట్టినా కానీ మొదటిరోజు సాధించిన సాలిడ్ కలెక్షన్స్ తో సినిమా బిజినెస్ లో చాలా వరకు వెనక్కి రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు రెండో రోజు కలెక్షన్స్ తో మరింత బిజినెస్ ని రికవరీ చేసేలా ఉందని చెప్పాలి. మరి రెండో రోజు సినిమా అనుకున్న విధంగా 1.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో మించుతుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here