బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో వీర లెవల్ లో కుమ్మేసినా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాస్ రాంపెజ్ తో స్లో డౌన్ అయ్యి పరుగును త్వరగానే పూర్తి చేసుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie)…
ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో అయితే హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. సినిమాలో ఉన్న ఎలివేషన్ లు మాస్ సీన్స్ కి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అయితే థియేటర్స్ లో సొంతం అవ్వలేదు, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత…
రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ ను దక్కించుకోగా ఇక్కడ మాత్రం సినిమా కి రెస్పాన్స్ ఊహించిన దానికి డబుల్ ట్రిపుల్ అనిపించే రేంజ్ లో సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. డిజిటల్ లో రిలీజ్ అయిన రోజునే టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన సినిమాకి…
సోషల్ మీడియాలో అనుకున్న దానికి మించి రెస్పాన్స్ సొంతం అవ్వగా తెలుగు ఆడియన్స్ కి మించి సినిమాకి నార్త్ అలాగే మలయాళ ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ సోషల్ మీడియాలో సొంతం అవ్వడం విశేషం కాగా, దాంతో పాటు కోలివుడ్ ఆడియన్స్ కూడా….
సినిమాలో ఉన్న ఎలివేషన్స్ కి ఫిదా అవుతున్నారు అని చెప్పాలి…ఇక నెట్ ఫ్లిక్స్ లో సినిమాకి మొదటి వారం రోజుల్లో రీజనల్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూవర్ షిప్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి..ఆల్ మోస్ట్ 2.4 మిలియన్ వ్యూస్ మార్క్ ని…
సినిమా సొంతం చేసుకోగా రీసెంట్ టైంలో వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ కన్నా కూడా ఎక్కువ వ్యూవర్ షిప్ ను డాకు మహారాజ్ సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో డబ్ వర్షన్ ను రిలీజ్ చేయడం కలిసి వచ్చి ఈ రేంజ్ లో వ్యూవర్ షిప్ వచ్చినప్పటికీ కూడా బాలయ్య కెరీర్ లో ఇక్కడ కూడా ఇది రికార్డ్ అని చెప్పాలి.