బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలతో కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఈ సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద…
ఆల్ రెడీ డీసెంట్ బజ్ ఉండగా సినిమా నుండి వచ్చిన మొదటి 2 పాటలు ఓకే అనిపించేలా ఉన్నప్పటికీ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుండి సొంతం చేసుకోలేక పోయింది. ఇలాంటి టైంలో సినిమా నుండి మూడో సాంగ్ అయిన దబిడి దిబిడి(Dabidi Dibidi Lyrical | Daaku Maharaaj)
సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…ఊర్వశి రౌతెల తో చేయించిన ఈ స్పెషల్ సాంగ్ ఓకే అనిపించేలా ఉన్నప్పటికీ ఓవరాల్ పాట బీట్ జైలర్ లోని కావలయ్య సాంగ్ ను గుర్తు చేసింది..దాంతో కాపీ పాట అంటూ ఒక పక్క ట్రోల్స్ కూడా పడుతూ ఉన్నప్పటికీ…
ఆ ట్రోల్స్ ని మించి సాంగ్ లో బాలయ్య ఊర్వశి రౌతెల స్టెప్స్ పై సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి ఇప్పుడు….ఇద్దరు యాక్టర్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం, కొరియోగ్రాఫర్ బాలయ్యతో వేయించిన స్టెప్స్ కొంచం ఓవర్ ది బోర్డ్ అనిపించేలా ఉండటంతో…
లాస్ట్ ఇయర్ ఆగస్టు లో మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ వేసిన స్టెప్స్ కి ఎలా ట్రోల్స్ పడ్డాయో ఇప్పుడు అదే రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి…కొందరు దీన్ని సమర్దిస్తూ కామెంట్స్ చేస్తున్నప్పటికీ చాలా వరకు అయితే ట్రోల్స్ లోకల్ నుండి నేషనల్ లెవల్ కి చేరుకొని…
బాలీవుడ్ వాళ్ళు సైతం ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు…కొందరు ఫ్యాన్స్ సైతం ఆ స్టెప్స్ బాలేవు, సినిమా నుండి తీసేయండి అంటూ టీం కి మెసేజ్ లు కూడా పెడుతున్నారు… ఓవరాల్ గా సినిమా మీద ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ జరగలేదు కానీ సడెన్ గా ఒక్క సాంగ్ తో భారీగా ట్రోల్స్ పడుతున్నాయి. మరి మేకర్స్ సాంగ్ ను సినిమాలో ఉంచుతారో లేదో చూడాలి ఇక..