నాచురల్ స్టార్ నాని తన లేటెస్ట్ మూవీ దసరా విషయంలో మొదటి నుండి కూడా పాన్ ఇండియా మూవీ అవ్వడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్ గా కూడా నెల రోజుల ముందు నుండే సినిమాను విపరీతంగా ప్రమోట్ చేశాడు…ముఖ్యంగా సినిమా హిందీ మార్కెట్ లో క్లిక్ అయితే కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువగా ప్రమోట్ చేశాడు… కానీ ఓవరాల్ గా ఇప్పుడు సినిమా….
మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ మాత్రం నిరాశ పరిచే విధంగా ఉండటం విచారకరం అని చెప్పాలి. సినిమా కి కేరళలో వీకెండ్ మొత్తం మీద 46 లక్షల గ్రాస్ కూడా సొంతం అవ్వలేదు. తమిళ్ లో కొంచం పర్వాలేదు అనిపించినా అక్కడ కూడా కేవలం 1.75 కోట్ల లోపే గ్రాస్ ను…
సినిమా సొంతం చేసుకుని నిరాశ పరిచింది. ఇక సినిమా హిందీ లో భారీ ఆశలు పెట్టుకుంటే 4 రోజుల్లో కేవలం 2.4 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అన్నీ కలుపుకుని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో ఇతర భాషల మీద ఆశలు పెట్టుకున్నా నిరాశనే సినిమాకి సొంతం అయ్యింది…
కానీ అదే టైంలో సినిమా ఓవర్సీస్ లో మాస్ కంటెంట్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించడం, నైజాంలో ఊరమాస్ వసూళ్లు సినిమాకి కలిసి వచ్చి ఓవరాల్ గా మంచి విజయం దిశగా దూసుకు పోతున్న దసరా హిందీలో ఈ వర్కింగ్ డేస్ లో టికెట్ రేట్స్ ని తగ్గించిన కారణంగా ఏమైనా ఇమ్ర్పూవ్ మెంట్ ని చూపిస్తుందో చూడాలి…