2021 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో అన్ని సినిమాల లోకి ముందు నిలిచే సినిమా ఆర్ ఆర్ ఆర్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అన్ని రికార్డులను ఎప్పుడెప్పుడు తుడిచి పెడుతుందా అని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ కి లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ ఇప్పుడు సెకెండ్ వేవ్ అడ్డుగా నిలిచాయి. సినిమా రిలీజ్ టైం కి థార్డ్ వేవ్ కూడా..
రెడీగా ఉంటుంది అన్న టాక్ ఉన్న నేపధ్యంలో సినిమా వచ్చే ఇయర్ సంక్రాంతి టైం కి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉందో అందరికీ తెలిసిందే. ఎప్పుడు వచ్చినా కొత్త రికార్డులతో దుమ్ము దుమారం చేసే కెపాసిటీ…
ఆర్ ఆర్ ఆర్ కి ఎంతైనా ఉందని అందరూ నమ్ముతూ ఉండగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్స్ లో ఒకరైన తమ్మారెడ్డి బరద్వాజా మరో అడుగు ముందుకేసి ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అనేది ప్రిడిక్ట్ చేసి చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.
సినిమా ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ డే మినిమమ్ 200 కోట్ల రేంజ్ కి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందని, ఇక వీకెండ్ మొత్తం మీద 400 కి తగ్గకుండా కలెక్షన్స్ ఉంటాయాని, అన్నీ అనుకున్నట్లు జరిగితే 500 కోట్ల మార్క్ ని కూడా వీకెండ్ లోనే ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.
ఈ ప్రిడిక్షన్ నిజం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. నార్మల్ టైం లో రిలీజ్ అయినా కానీ కొంచం అటూ ఇటూ గా ఈ రేంజ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుంది, ఇక పండగ వీకెండ్ లో రిలీజ్ అయితే అంచనాలను సైతం మించే కెపాసిటీ ఈ సినిమా కి ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు ఈ డైరెక్టర్. మరి ఈ ప్రిడిక్షన్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.