బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించనిది జరిగితే ఇలా ఉంటుంది, టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమానే అయినా లేట్ అయ్యి ఎట్టకేలకు రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మూడు రోజుల…
ముందే మొదలు అయినప్పటికీ ఏమాత్రం బుకింగ్స్ జోరు అందుకోలేదు… దాంతో సినిమా ఇక మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయింది. అలా ఇక ఆడియన్స్ లో కూడా సినిమాకి డిఫెరెంట్ టాక్ లభించింది. కొందరిని అలరించింది కొందరికి సినిమా..
బోర్ కొట్టేలా చేసింది. అది పక్కకు పెడితే సినిమా ఓపెనింగ్స్ 30 లక్షల రేంజ్ లో ఉండొచ్చని రిలీజ్ కి ముందు ఉన్న బుకింగ్స్ ని చూసి అంచనా వేసినప్పటికీ రిలీజ్ రోజుకి వచ్చే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ ను దుమ్ము లేపే రేంజ్ లో షేక్ చేసి ట్రేడ్ కి షాక్ ఇచ్చింది…
సినిమా అనుకున్న రేంజ్ కన్నా కూడా ఇప్పుడు మూడు రెట్లు అధికంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 80 లక్షల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. కంప్లీట్ ఆఫ్ లైన్ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండేలా ఉండటం తో ఇప్పుడు సినిమా…
మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది నిజంగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. సంక్రాంతి మూవీస్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఓపెనింగ్స్ ఈ సినిమాకే దక్కడం విశేషం. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎంతవరకు అంచనాలను అందుకుంటాయో చూడాలి ఇక…