Home న్యూస్ డే 18 కలెక్షన్స్…ఊచకోత కోశాడు!

డే 18 కలెక్షన్స్…ఊచకోత కోశాడు!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర హాలిడే రోజు కి ఉండే అడ్వాంటేజ్ వేరు అని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో స్లో అవ్వడం తో ఇక తేరుకోలేదు అనుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ హాలిడే రోజున దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమా 17 రోజుల్లో 96.3 కోట్ల షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించగా 18 వ రోజు వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి గా మారింది.

కాగా సినిమా 18 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల నుండే బెటర్ ఆక్యుపెన్సీ తో జోరు చూపగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మరింత గ్రోత్ ని సాధించి ఓవరాల్ గా 35% కి పైగా ఆక్యుపెన్సీ తో నైట్ షోలలో జోరు చూపుతూ దూసుకుపోతుంది.

కాగా 18 వ రోజు 70 లక్షల కు పైగా షేర్ కంఫామ్ అనుకోగా ఇప్పుడు ఆ లెక్క 80 దాటి 90 చేరే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి… నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండటంతో ఈ మార్క్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు.

ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో 19.2 కోట్ల షేర్ ని అందుకోగా ఈ రోజు అరవింద సమేత రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ రోజు లెక్క 80 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

ఇక పందెం కోడి 2 10 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 6.5 కోట్ల షేర్ ని అందుకోగా 11 వ రోజు కొంచం గ్రోత్ ని సాధించగా ఓవరాల్ గా కలెక్షన్స్ 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద ఆదివారం టాలీవుడ్ కి బాగానే కలిసి వచ్చింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here