Home న్యూస్ గాడ్ ఫాదర్-ది ఘోస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్…మెగాస్టార్ భీభత్సం ఇది!!

గాడ్ ఫాదర్-ది ఘోస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్…మెగాస్టార్ భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరా కి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో బరిలోకి దిగగా రెండు సినిమాల్లో మెగాస్టార్ క్లియర్ డామినేషన్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతున్నాడు అని చెప్పాలి. నార్మల్ టికెట్ రేట్స్ తోనే బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ రెండు సినిమాల్లో గాడ్ ఫాదర్ ఆచార్యలో ఎలాంటి హైక్స్ అండ్ భారీ రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో…

సొంతం కాక పోయినా కానీ ఉన్నంతలో ఉన్న థియేటర్స్ లోనే ఓవరాల్ గా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో మొదటి రోజుని ఎంజాయ్ చేయగా ది ఘోస్ట్ సినిమా కొన్ని చోట్ల కొన్ని షోలు హౌస్ ఫుల్స్ పడ్డా కానీ ఓవరాల్ గా మాత్రం గాడ్ ఫాదర్ తో పోల్చితే…

చాలా స్లో స్టార్ట్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది అని చెప్పాలి. మొత్తం మీద గాడ్ ఫాదర్ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల రిపోర్ట్స్ చూసి 15కోట్ల రేంజ్ షేర్ తొలిరోజు రావొచ్చు అనుకోగా ఇప్పుడు సినిమా 16-18కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది అని చోట్లా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు ఇలానే కొనసాగి ఉంటే… ఫైనల్ లెక్కలు కొంచం అటూ ఇటూ ఉండే అవకాశం కూడా ఉండగా కొన్ని చోట్ల ఇంకొంచం పెరగవచ్చు. ఇక ది ఘోస్ట్ తొలిరోజు 1.8కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్లు అందుకోవచ్చు, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది.

ఇక పోటిలో రిలీజ్ అయిన చిన్న సినిమా స్వాతిముత్యం లిమిటెడ్ రిలీజ్ లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ని అందుకోగా లాంగ్ వీకెండ్ లో మెల్లి మెల్లిగా షోలను పెంచుకుని కలెక్షన్స్ పరంగా జోరు చూపించే అవకాశం ఉంది. ఇక ఈ మూడు సినిమాల అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో ఉండవో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here