బాక్స్ అఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన తండేల్(Thandel Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీక్ ని పూర్తి చేసుకుని రెండో వీక్ లో అడుగు పెట్టగా ఈ వీక్ లో కొత్త అలాగే రీ రిలీజ్ లు చాలానే ఉన్నప్పటికీ కూడా మంచి జోరునే చూపెడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ వీక్ మూవీస్ లో…
విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లైలా(Laila Movie)మూవీ డీసెంట్ నోటబుల్ మూవీ అవ్వడంతో ఎంతో కొంత ఇంపాక్ట్ ను చూపెడుతుంది అనుకున్నా కూడా పెద్దగా బజ్ ను క్రియేట్ చేయలేక పోయిన సినిమా బుకింగ్స్ పరంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు…
ఇక ఓపెనింగ్స్ పరంగా కూడా బుక్ మై షో లో టికెట్ సేల్స్ పరంగా ప్రతీ గంట 1000-1500 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ కొత్త సినిమా రేంజ్ లో అయితే జోరు చూపించ లేక పోతుంది. అదే టైంలో రెండో వీక్ 8 వ రోజులో ఉన్న తండేల్ మూవీ మాత్రం ప్రతీ గంట ఏకంగా…
2000-3000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటంతో ఈ రోజు కలెక్షన్స్ పరంగా కొత్త సినిమాల కన్నా కూడా తండేల్ మూవీ మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది అని చెప్పాలి ఇప్పుడు. ఈ వీకెండ్ సినిమాల మీద తండేల్…
క్లియర్ డామినేషన్ ని చూపెడుతూ ఉండటంతో సినిమా ఈ శని ఆది వారాల్లో కచ్చితంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. కానీ అదే టైంలో లైలాతో కంబ్యాక్ ఎక్స్ పెర్ట్ చేసిన విశ్వక్ సేన్ కి నిరాశ కలిగే రిజల్ట్ రాబోతూ ఉండగా నాగ చైతన్య మాస్ కంబ్యాక్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు ఈ వీకెండ్ లో కూడా….