Home న్యూస్ రికార్డ్ మీద రికార్డ్…రాయలసీమ డే 2 దేవర మాస్ రికార్డ్ ఇది!

రికార్డ్ మీద రికార్డ్…రాయలసీమ డే 2 దేవర మాస్ రికార్డ్ ఇది!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కి తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉంది…అందులో ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరో లెవల్ లో ఉంటుంది….ఆరేళ్ళ క్రితం అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్ ఓపెనింగ్ డే రోజున సాధించిన వర్త్ షేర్ రికార్డ్ రీజనల్ మూవీస్ లో ఇప్పటికీ టాప్ లో కొనసాగుతూ ఉండగా లేటెస్ట్ గా 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేసిన…

పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపింది. ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని నాన్ ఆర్ ఆర్ ఆర్ మూవీస్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ పరంగా కూడా సంచలన హోల్డ్ ని సీడెడ్ లో చూపించి దుమ్ము దుమారం లేపింది…రీసెంట్ టైంలో వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ అయిన…

సలార్(Salaar) రెండో రోజు ఇక్కడ 3 కోట్ల షేర్ ని అందుకోగా తర్వాత వచ్చిన కల్కి(Kalki 2898 AD) 2.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. కానీ అదే టైంలో దేవర మూవీ రెండో రోజు సీడెడ్ ఏరియాలో 3.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించి నాన్ ఆర్ ఆర్ ఆర్ డే 2  రికార్డు ను ఇక్కడ నమోదు చేసింది…

ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో రోజు సీడెడ్ ఏరియాలో 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టింది….ఇప్పుడు 3.70 కోట్ల షేర్ తో దేవర మూవీ మాస్ రాంపెజ్ ను చూపించగా రెండు సినిమాలలో కూడా ఎన్టీఆర్ నటించడంతో తన పేరిట సీడెడ్ ఏరియాలో రికార్డులు మొదటి రెండు రోజులకు గాను…

ఇప్పుడు నమోదు అవ్వడం విశేషం కాగా…నైజాంలో టికెట్ హైక్స్ రెండో రోజు తగ్గించడంతో షేర్స్ మిగిలిన బిగ్ మూవీస్ తో పోల్చితే కొంచం తక్కువగానే ఉన్నా సీడెడ్ లో మాత్రం ఎన్టీఆర్ పేరిట రికార్డుల జాతర కొనసాగుతుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా రాయలసీమ ఎలాంటి కలెక్షన్స్ తో జోరుని ఇలానే కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here