మొదటి 2 రోజుల్లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కార్తికేయ2 సినిమా మూడో రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే అడ్వాంటేజ్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉండనిపించేలా దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా కి ఏర్పడ్డ డిమాండ్ దృశ్యా సినిమా మరి కొన్ని చోట్లా ఎక్స్ ట్రా స్క్రీన్స్ ని యాడ్ చేశారు కానీ ఓవరాల్ గా డిమాండ్ కి తగ్గట్లు అయితే స్క్రీన్స్ ని…
పెంచలేదు అనే చెప్పాలి. అయినా కానీ సినిమా ఉన్న స్క్రీన్స్ లోనే ఊరమాస్ ఆక్యుపెన్సీతో దూసుకు పోతూ ఉండగా సినిమా మార్నింగ్ షోలకు కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ మ్యాట్నీ షోల టైం కి తిరిగి అన్ని సెంటర్స్ లో దుమ్ము లేపుతుంది.
ఇక బాక్స్ అఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊరమాస్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఈ రోజు బాక్స్ అఫీస్ జాతర ఖాయం అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు 3.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా అన్ని సెంటర్స్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తే సినిమా 3.5 కోట్ల నుండి 3.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ వైపు దూసుకు పోతున్న కార్తికేయ 2 సినిమా హిందీ లో కూడా జోరు చూపిస్తూ షోలను పెంచుకుంటూ దుమ్ము లేపుతుంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో హోల్డ్ చేస్తుందా ఇంతకుమించిన జోరు చూపిస్తుందో చూడాలి ఇక…