బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మూవీ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ ఓవరాల్ వాల్యూ టార్గెట్ ను అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి. సినిమా 6వ రోజు 1.51 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 7వ రోజు మరో…
వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి 25% రేంజ్ లో డ్రాప్ అయింది, కొన్ని చోట్ల కొంచం డ్రాప్స్ ఎక్కువగానే ఉండగా మొత్తం మీద సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూ గా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…
మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కొంచం కలెక్షన్స్ అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా అంతకన్నా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
మొత్తం మీద సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 1.50 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అది కూడా కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వారంలో ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. కానీ సినిమా ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.