టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ వర్కింగ్ డేస్ లో ఎలాంటి ఇంపాక్ట్ ను చూపించడం లేదు, సినిమా రిలీజ్ అయ్యింది, మంచి పాజిటివ్ రివ్యూలను ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా మెగాస్టార్ ఇతర సినిమాలతో పోల్చితే మాత్రం ఈ కలెక్షన్స్ నిరాశ పరిచే విధంగానే ఉన్న ఉన్నంతలో పండగ వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో…
సినిమా ఏమాత్రం అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేయడం లేదు, అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు సరిపోవు అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు తో పోల్చితే ఇప్పుడు 7వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో….
మరోసారి 25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా కొన్ని చోట్లా పర్వాలేదు అనిపించే విధంగా బుకింగ్స్ ఉన్నా ఓవరాల్ గా మాత్రం డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ని బట్టి మొత్తం మీద సినిమా ఈ రోజు…
తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యం అని చెప్పాలి. ఇక సినిమా డే ఎండ్ అయ్యే టైం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.