తమిళ్ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డిమోంటి కాలనీ 2(Demonte Colony2 Telugu Review) సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది వరకు వచ్చిన మొదటి పార్ట్ తమిళ్ లో డీసెంట్ హిట్ ని సొంతం చేసుకోగా సీక్వెల్ కూడా ఆకట్టుకోగా తెలుగు లో సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే…కాన్సర్ ను సైతం జయించిన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ భర్త సర్జనో ఖాలిద్ అనుమానాస్పదంగా ఆత్యహత్య చేసుకున్న విషయం తట్టుకోలేని హీరోయిన్ హీరో ఆత్మతో మాట్లాడే ప్రయత్నాలు మొదలు పెట్టగా ఈ క్రమంలో హీరో ఆత్మ ఒక పుస్తకం చదవడం వలన తాను చనిపోయాయని చెబుతాడు….
ఆ పుస్తకం వెనక ఉన్న మిస్టరీ ఏంటి…ఆ తర్వాత కథ ఏం అయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….హర్రర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన డిమోంటి కాలనీ 2 మొదటి పార్ట్ చూసిన వాళ్ళకి బాగానే ఇంప్రెస్ చేస్తుంది కానీ చూడని ఆడియన్స్ కి మాత్రం చాలా వరకు స్క్రీన్ ప్లే…
కన్ఫ్యూజిక్ గా అనిపించినా కూడా పార్టు పార్టులుగా సినిమా ఆసక్తికరంగానే సాగుతుంది. మెయిన్ సీన్స్ కొన్ని మెప్పించడంతో కొత్తగా చూసే ఆడియన్స్ ఒక స్టేజ్ తర్వాత బాగానే కనెక్ట్ అవుతారు సినిమా కి…థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో బాగానే ఉండటం కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి…
అలాగే లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఆకట్టుకోగా సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా మెప్పించింది, స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా అనిపించడం, కొన్ని చోట్ల కథని ఎక్కువగా డ్రాగ్ చేసినట్లు అనిపించడం, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ ఎక్కువ డ్రాగ్ అవ్వడం, ముందే చెప్పినట్లు మొదటి పార్ట్ చూడని వాళ్ళకి ఎక్కువ టైం పట్టడం లాంటివి డ్రా బ్యాక్స్…
కానీ రీసెంట్ టైంలో ఎన్నో అంచనాలు పెట్టుకుని తీవ్రంగా నిరాశ పరిచిన పెద్ద బడ్జెట్ మూవీస్ తో పోల్చితే బెటర్ ఔట్ పుట్ తోనే ఈ సినిమా వచ్చింది అని చెప్పాలి, హర్రర్ అండ్ థ్రిల్లర్ జానర్స్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా పర్వాలేదు అనిపించేలా నచ్చే అవకాశం ఉంది…
మిగిలిన ఆడియన్స్ కి కొంచం ఓపిక పట్టి చూస్తె ఓవరాల్ పర్వాలేదు మంచి థ్రిల్లర్ మూవీ అనిపిస్తుంది డిమోంటి కాలనీ 2 సినిమా….గ్రాఫిక్స్ వర్క్ మరింత బాగుండి హర్రర్ ఎలిమెంట్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండి ఉంటే సినిమా మరింత మెప్పించేది… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….