Home న్యూస్ దేశముదురు రీ రిలీజ్ కలెక్షన్స్…అల్లు అర్జున్ మాస్!!

దేశముదురు రీ రిలీజ్ కలెక్షన్స్…అల్లు అర్జున్ మాస్!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజున అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్ మాస్ హిట్ అయిన దేశముదురు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు, 4K లో సినిమాను రీ రిలీజ్ చేయగా సుమారు 130 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సినిమా కి కొన్ని చోట్ల ఎక్స్ లెంట్ రెస్పాన్స్ రాగా కొన్ని చోట్ల షోలు అనుకున్న రేంజ్ లో ఆక్యుపెన్సీ పడలేదు, అయినా కానీ సినిమా రీ రిలీజ్…

మొదటి రోజున ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. సినిమా నైజాం ఏరియా లో మొదటి రోజు 68 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఒక్క వైజాగ్ ఏరియాలోనే 31 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

ఇక టోటల్ ఆంధ్ర రీజన్ లో 60 లక్షల గ్రాస్ ను అందుకున్న సినిమా సీడెడ్ లో 18 లక్షల గ్రాస్ ను సాధించగా టోటల్ గా మొదటి రోజు కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది… 
👉Nizam – 68L
👉Ceeded – 18L~
👉Andhra – 60L~
👉AP-TG Total Collections – 1.46CR~ GROSS
👉KA+ROI – 4L
Total Collections – 1.50CR GROSS~

రెస్ట్ ఆఫ్ ఇండియాలో చాలా తక్కువ చోట్ల సినిమా షోలు పడగా వరల్డ్ వైడ్ గా 1.50 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో సినిమా అల్లు అర్జున్ మాస్ పవర్ ని చూపిస్తూ దుమ్ము లేపింది. ఇక ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here