Home న్యూస్ దేశముదురు రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

దేశముదురు రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రీ రిలీజ్ అయిన అల్లు అర్జున్ మాస్ హిట్ మూవీ దేశముదురు సినిమా మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 1.46 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని జోరు చూపించగా రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్…

ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత రోజు నుండి మాత్రం పెద్దగా జోరు చూపించలేదు, కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఆ హడావుడిలో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా జోరు చూపించలేదు, ఇక కేరళలో ఇతర చోట్ల కూడా రీ రిలీజ్ అయినా…

పెద్దగా రెస్పాన్స్ ఆడియన్స్ నుండి అనుకున్న విధంగా రాలేదు. ఓవరాల్ గా మొదటి రోజు ఇండియా లో 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా మిగిలిన రోజుల్లో మరో 15 లక్షల లోపే గ్రాస్ ను మొత్తం మీద సొంతం చేసుకుందని చెప్పాలి…

ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 1.54 కోట్ల గ్రాస్ ను అందుకుంటే మిగిలిన చోట్ల మరో 11 లక్షల దాకా గ్రాస్ ను సినిమా సాధించింది. దాంతో టోటల్ గా సినిమా రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 1.65 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుందని చెప్పాలి. ఉన్నంతలో మంచి స్టార్ట్ వచ్చినా తర్వాత పరుగును త్వరగానే పూర్తీ చేసుకుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here