Home న్యూస్ దేవదాస్ డే 1 కలెక్షన్స్…దుమ్ము లేచిపోయింది

దేవదాస్ డే 1 కలెక్షన్స్…దుమ్ము లేచిపోయింది

0

నాగ్ అండ్ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్స్ గా నిలుస్తుంది అనుకున్న దేవదాస్ మొత్తం మీద మొదటి రోజు చివరికి వచ్చేసరికి నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవబోతుంది. కానీ నాని కెరీర్ లో మాత్రం సెకెండ్ బెస్ట్ ఓపెనర్ గా నిలబోతుంది ఈ సినిమా.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఓపెనింగ్స్ మొత్తం మీద 60% వరకు ఉండగా టాక్ బాగానే ఉండటం తో ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ 80% వరకు వెళుతుంది అనుకున్నారు ట్రేడ్ విశ్లేషకులు…కానీ లేట్ నైట్ షోస్ ని పక్కకు పెడితే టోటల్ గా 70% వరకు గ్రోత్ ని మాత్రమే సినిమా సాధించింది.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద మొదటి రోజు 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ లేట్ నైట్ షోల గ్రోత్ బాగుంటే ఈ లెక్క పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here