Home గాసిప్స్ ఇంకా 6 నెలలు ఉంది…ఇక్కడ 120 తో అల్లకల్లోలం!

ఇంకా 6 నెలలు ఉంది…ఇక్కడ 120 తో అల్లకల్లోలం!

0

రెండేళ్ళ క్రితం RRR మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ లేపి పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఆ సినిమా తర్వాత ఆచార్య(Acharya) తో భారీ ఫ్లాఫ్ ను సొంతం చేసుకున్న కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో చేస్తున్న దేవర(Devara Part 1) చేస్తూ ఉండగా ఈ సినిమా…

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే రిలీజ్ అయ్యి రికార్డు కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపేది కానీ సినిమా అనుకోకుండా పోస్ట్ పోన్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రిలీజ్ కి ఇంకా 6 నెలల టైం ఉండగానే…

ఇప్పటి నుండే బిజినెస్ ఆఫర్స్ ఓ రేంజ్ లో వస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మేకర్స్ కోట్ చేసిన లెక్క వన్ ఆఫ్ ది రికార్డ్ బిజినెస్ రేటు చెబుతూ ఉండగా సినిమాను కొనడానికి బయర్స్ కూడా భారీ రేట్స్ ను కోట్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి… మేకర్స్ ఆల్ మోస్ట్ 130-135 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ ను ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా…

మేజర్ ప్రొడ్యూసర్స్ దేవర పార్ట్ 1 ను కొనడానికి ఆల్ మోస్ట్ 120 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా రేటు కోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది….టాలీవుడ్ లో ఈ రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని తర్వాత టార్గెట్ ను అందుకున్న సినిమాలు తక్కువే ఉన్నాయి. కానీ దేవర మీద ఎక్స్ పెర్టేషన్స్ సాలిడ్ గా ఉండటంతో…

దసరా టైంలో ఏమాత్రం సినిమా అంచనాలను అందుకున్నా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సాంగ్స్ మరియు ట్రైలర్ లు రిలీజ్ అయ్యాక అంచనాలను మించిపోతే సినిమా మీద బజ్ మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here