బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర(Devara Part 1), అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తో కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అయితే…
మిక్సుడ్ టాక్ తోనే ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది, దీపావళి వీకెండ్ లో కొత్త సినిమాలు రావడంతో ఈ సినిమా రన్ కంప్లీట్ అవ్వగా రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా…
ఓటిటి లో ఇప్పుడు సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఇక్కడ నుండి సినిమాకి రెస్పాన్స్ థియేటర్స్ లో వచ్చినట్లే మిక్సుడ్ గానే ఉంది…సీన్ బై సీన్ మంచి హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నప్పటికీ కథలో అంట దమ్ము అయితే లేదనే అంటున్నారు..
సెకెండ్ ఆఫ్ కథ కొంచం ట్రాక్ తప్పడం క్లైమాక్స్ పోర్షన్ పెర్ఫెక్ట్ గా ఎండ్ చేయలేక పోవడం మేజర్ డ్రా బ్యాక్స్ అని అంటూ ఉన్నారు…అదే టైంలో సినిమాలో ఫైట్ సీన్స్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, అనిరుద్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ అల్టిమేట్ బ్యాగ్రౌండ్ స్కోర్ లు మేజర్ ప్లస్ పాయింట్స్ అని…
దానికి తోడూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన కొన్ని సీన్స్ ఓ రేంజ్ లో రావడంతో సీన్ బై సీన్ బాగానే ఆకట్టుకోవడం వలనే కథలో అంత దమ్ము లేకపోయినా ఎన్టీఆర్ స్టార్ పవర్ తో ఆ రేంజ్ విజయాన్ని సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు అందరూ…
మొదటి రోజు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు మిక్సుడ్ రెస్పాన్స్ తోనే ఓపెన్ అయ్యి టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ ఉన్నా ఊహకందని రేంజ్ లో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసింది. అదే టైంలో ఇప్పుడు ఓటిటి లో కూడా సినిమాలో కొన్ని హైలెట్ సీన్స్ కోసం కచ్చితంగా సాలిడ్ రిపీట్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.