Home న్యూస్ సోషల్ మీడియా బగ్గు మంటుంది…ఈ రిస్క్ అవసరమా!!

సోషల్ మీడియా బగ్గు మంటుంది…ఈ రిస్క్ అవసరమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ వచ్చే బిగ్ పాన్ ఇండియా మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎలా ఆశగా ఎదురు చూస్తారో…ఇతర హీరోల ఫ్యాన్స్ నెగటివ్స్ స్టఫ్ కోసం కూడా అంతే ఆశగా ఎదురు చూస్తారు…చాలా వరకు టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ఎక్కువ మంది అవ్వడంతో ప్రతీ హీరో సినిమా రిలీజ్ విషయంలో మిక్సుడ్ రెస్పాన్స్ లు…

సోషల్ మీడియా ట్రోల్స్ అనేవి కామన్ అనే చెప్పాలి…రీసెంట్ బిగ్ పాన్ ఇండియా మూవీ కల్కి రిలీజ్ టైంలో కూడా నెగిటివిటీ ఉండగా ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) రిలీజ్ టైంలో నెగిటివిటీ మరికాస్త ఎక్కువగానే ఉంది..

ఫ్యాన్స్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఇతర హీరోల ఫ్యాన్స్ సినిమా నుండి నెగిటివిటీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దాంతో రిలీజ్ టైం కన్నా ముందు నుండే సోషల్ మీడియా ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ తో మగ్గు మంటూ ఉండగా ఇప్పుడు…

సినిమా రిలీజ్ దగ్గర పడగా ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా కి నార్మల్ రిలీజ్ కన్నా కూడా స్పెషల్ మిడ్ నైట్ షోలతోనే ఓవర్సీస్ ప్రీమియర్స్ టైం నుండే ఇండియాలో మేజర్ సెంటర్స్ లో షోలు పడబోతూ ఉన్నాయని తెలుస్తుంది…

కానీ బయర్స్ మాత్రం ఈ నిర్ణయం మీద కొంత డౌట్ లో ఉన్నారని తెలుస్తుంది. మరీ మిడ్ నైట్ 1.08 నిమిషాల నుండే సినిమా ప్రదర్శితం అయితే సోషల్ మీడియాలో అప్పటి నుండే సినిమా ఇలా ఉంది అలా ఉంది అంటూ టాక్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది…

సూపర్ పాజిటివ్ గా ఉంటే ఏం ఎఫెక్ట్ ఉండదు కానీ ఏమాత్రం యావరేజ్ మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా కూడా నార్మల్ షోల కన్నా ముందే ఈ మిక్సుడ్ టాక్ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టడం ఖాయం….రీసెంట్ టైంలో ఇలా మిడ్ నైట్ షోలు పడిన సినిమాలలో…

వర్కౌట్ అయిన సినిమాలు చాలా తక్కువే….ఈ ఇయర్ లోనే గుంటూరు కారం, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు స్పెషల్ షోలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది…ఇప్పుడు దేవర రిలీజ్ టైంలో సోషల్ మీడియా ఆల్ రెడీ బగ్గుమంటూ ఉన్న టైంలో ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది…

కానీ మేకర్స్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండటం వలన సినిమా ఈ సారి అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అన్న నమ్మకం అందరి లోనూ ఉంది. మరి దేవర మూవీ అంచనాల గీతని మించిపోతుందో లేదో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here