Home న్యూస్ 14 రోజులు ముందుకు దేవర…ఇక రికార్డుల జాతర ఖాయం!

14 రోజులు ముందుకు దేవర…ఇక రికార్డుల జాతర ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా సినిమా రిలీజ్ ఆల్ మోస్ట్ 6 ఏళ్ళు అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూవీ ఆడియన్స్ ముందుకు అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సింది కానీ షూటింగ్ డిలే అండ్ ఎలక్షన్స్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి…

దసరా బరిలోకి ఎంటర్ అవ్వగా అక్టోబర్ 10న రిలీజ్ ను కన్ఫాం చేసుకున్నా కూడా దసరా టైంలో సినిమా కి పోటిగా ఇతర సినిమాలు చాలానే రిలీజ్ కానుండటంతో మరో డేట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) OG మూవీ రిలీజ్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో బిజీగా ఉండటం వలన పోస్ట్ పోన్ అయ్యి 2025 కి షిఫ్ట్ అవ్వడంతో…

   

సెప్టెంబర్ 27న డేట్ ఖాళీగా ఉండగా ఆ డేట్ కి ఇతర సినిమాలు రిలీజ్ ను కన్ఫాం చేసుకున్నా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీ పార్ట్ 1 ని ఇప్పుడు అదే డేట్ కి రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాంతో సినిమా కి పోటిగా అనౌన్స్ చేసిన సినిమాల రిలీజ్ లు ఎలాగూ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…

ఆల్ మోస్ట్ 14 రోజుల పాటు దేవర మూవీకి సోలో రిలీజ్ వరల్డ్ వైడ్ గా అలాగే ఇతర ఇండస్ట్రీలలో కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…దాంతో 14 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూవీకి సెన్సేషనల్ కలెక్షన్స్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

దసరా టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఓపెనింగ్స్ దక్కేవి కానీ రీసెంట్ టైంలో దసరా టైం మూవీస్ లాంగ్ రన్ ని అయితే సొంతం చేసుకునే విషయంలో వెనకడు వేశాయి. ఆ డేట్ తో పోల్చితే సెప్టెంబర్ 27న రిలీజ్ బెస్ట్ డేట్ అని చెప్పాలి. ఇక ఆ టైంకి దేవర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here