టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో సాలిడ్ గా అంచనాలు ఉన్నాయి ఇప్పుడు…ఓవర్సీస్ లో సెన్సేషనల్ ప్రీ బుకింగ్స్ తో…
మాస్ రచ్చ చేస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ మరో లెవల్ లో ఉంది…ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా మాస్ సెంటర్స్ లో కలెక్షన్స్ జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా అన్ని ఏరియాల కన్నా కూడా బాలీవుడ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందా అని…
అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. కాగా సినిమాను హిందీలో భారీ గా ప్రమోట్ చేయడానికి సన్నాహాలు మొదలు కాగా హిందీలో సినిమాను సోలోగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు ఇప్పుడు…
ప్రస్తుతానికి సినిమా కి హిందీలో సుమారు 2500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అన్న టాక్ వినిపిస్తూ ఉండగా రిలీజ్ టైంకి మేకర్స్ అక్కడ సినిమాను 3000 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఆడియన్స్ నుండి వచ్చే డిమాండ్ ను బట్టి తర్వాత…
స్క్రీన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది….ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ తో నార్త్ లో కూడా డీసెంట్ పేరుని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి దేవర సినిమా ఆ పేరు పవర్ ఎంతవరకు ఉందో క్లియర్ చేయబోతుంది…సినిమా హిందీలో మినిమమ్ 10 కోట్ల రేంజ్ దాకా ఓపెనింగ్స్ ను అందుకుంటే…
హిందీలో ఎక్స్ లెంట్ గానే ఓపెన్ అయ్యింది అని చెప్పొచ్చు..ఆ మార్క్ ని అందుకోవడం కష్టమే కాని సినిమా ఆడియో మంచి రీచ్ ను సొంతం చేసుకోవడంతో, సినిమా రిలీజ్ అయ్యి టాక్ బాగుంటే ఈ థియేటర్స్ లో ఈ ఓపెనింగ్స్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఇక సినిమా హిందీలో ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.