RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) సోలో హీరోగా చాలా టైం తర్వాత ఇప్పుడు దేవర పార్ట్1(Devara Part 1) మూవీతో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ముందు సమ్మర్ లో రిలీజ్ అనుకోవడంతో ఇక రికార్డుల జాతర ఖాయమని అందరూ అనుకున్నారు కానీ…
సినిమా షూటింగ్ పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో డేట్స్ పెద్దగా లేక పోవడంతో ఉన్నంతలో సినిమాకి దసరా వీకెండ్ అడ్వాంటేజ్ తో రిలీజ్ ను కన్ఫాం చేశారు. అక్టోబర్ 10 నుండి 13 వరకు దసరా వీకెండ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి 4 రోజులు ఫుల్ పండగ వీకెండ్ అడ్వాంటేజ్ అయితే సొంతం కాబోతుంది…
కానీ ఫ్యాన్స్ మాత్రం దసరా రిలీజ్ పై ఏమాత్రం సంతోషంగా లేరని సోషల్ మీడియాలో చాలా వరకు రిలీజ్ డేట్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి మేజర్ కారణం టాలీవుడ్ లో మిగిలిన అన్ని పండగ సీజన్స్ లో కూడా వీకేస్ట్ అడ్వాంటేజ్ దసరా సీజన్ కే ఉంటూ వస్తుంది రీసెంట్ టైంలో…..రీసెంట్ ఇయర్స్ అన్నీ చూసుకుంటే…
2017 నుండి 2023 వరకు కూడా చాలా సినిమాలకు పండగ టైంలో కలెక్షన్స్ లభించినా పండగ తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయ్యాయి…లాస్ట్ ఇయర్ కూడా దసరా టైంలో క్లాష్ లో వచ్చిన మూవీస్ లో భగవంత్ కేసరికి టాక్ బాగున్నా ఓపెనింగ్స్ రాలేదు….కానీ ఎలాగోలా పడుతూ లేస్తూ లాంగ్ రన్ సొంతం అయ్యి హిట్ గీతని దాటింది..
ఇది వరకు ఎన్టీఆర్ నటించిన జైలవకుష, అరవింద సమేత సినిమాలు దసరాకి వచ్చి ఓపెనింగ్స్ కుమ్మేసినా లాంగ్ రన్ అయితే దక్కలేదు…దాంతో దసరా దాకా ఆగం అవసరం అయితే సంక్రాంతి వరకు ఆగుతాం కానీ దసరా కి మాత్రం దేవరని రిలీజ్ చేయకండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు….మరి దేవర ఫైనల్ గా అదే డేట్ కి వస్తుందా లేక మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటాయో చూడాలి.