ఫస్ట్ డే ఉగాది పండగ అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ సినిమా సెన్సేషనల్ స్టార్ట్ తర్వాత రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్ అయినా ఉన్నంతలో డీసెంట్ హోల్డ్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ని…
కంప్లీట్ అవ్వగా రెండో రోజు నుండి ప్రాఫిట్స్ ను ఎంజాయ్ చేయబోతుంది. ఇక రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70% రేంజ్ లో డ్రాప్స్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో కూడా ఇదే విధంగా డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా…
సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1 కోటి రేంజ్ లో కూడా కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజు బాక్స్ అఫీస్ దగ్గర…
1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 రోజులకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.