Home న్యూస్ NTR30 స్టొరీ రివీల్ చేసిన కొరటాల శివ…ఇంత కాన్ఫిడెంట్స్ ఏంటి సామి!!

NTR30 స్టొరీ రివీల్ చేసిన కొరటాల శివ…ఇంత కాన్ఫిడెంట్స్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మరియు భరత్ అనే నేను ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకున్న కొరటాల శివ లాస్ట్ ఇయర్ చేసిన ఆచార్య సినిమాతో ఊహకందని డిసాస్టర్ ను దక్కించుకోగా ఎపిక్ ఫ్లాఫ్ గా నిలిచిన ఆ సినిమా ఇంపాక్ట్ వలన ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఉంటుందో ఉండదో అన్న అనుమాణాలు ఎన్నో చక్కర్లు కొట్టినా ఎన్టీఆర్30 సినిమా ఉంటుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా…

ఎట్టకేలకు సినిమా ఇప్పుడు పూజా కార్యక్రమాలను ఉగాది తర్వాత రోజున పూర్తీ చేసుకుంది, ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో జరగబోతుండగా వచ్చే ఏర్పిల్ లో సినిమాను రిలీజ్ చేస్తామని ఆల్ రెడీ అనౌన్స్ చేశారు.

ఇక ఈ రోజు లాంచ్ ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడిన కొరటాల శివ సినిమా కథని కూడా రివీల్ చేశారు….”కోస్టల్ ఫారెస్ట్ లాండ్స్ లో ఈ కథ జరుగుతుందని, ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువ వుంటారు, దేవుడు అంటే భయం లేదు చావు అంటే భయం లేదు కానీ ఒకే ఒక్కటి అంటే భయం ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది… 

అంటూ కథ పాయింట్ ని చెప్పగా అలాంటి చోట హీరో ఎంట్రీ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ అంటూ చెబుతూనే ఈ సినిమా ఇప్పటి వరకు తన నుండి వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ కాబోతుంది అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు కొరటాల శివ. ఈ రేంజ్ కాన్ఫిడెంట్ గా ఏ సినిమాకి చెప్పని కొరటాల ఇప్పుడు ఇలా చెప్పడంతో కచ్చితంగా ఈ సినిమాతో అద్బుతాలు సృష్టించే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here