Home TRP రేటింగ్ 5 ఏళ్ల క్రితం మూవీ…45 లక్షల రేటు….షాకింగ్ TRP రేటింగ్!

5 ఏళ్ల క్రితం మూవీ…45 లక్షల రేటు….షాకింగ్ TRP రేటింగ్!

0

వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండటం తో అప్పుడప్పుడు శాటిలైట్ సేల్ అవ్వని ఓల్డ్ మూవీస్ ని శాటిలైట్ రైట్స్ కొని తెలుగులో టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తూ మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుంటున్న స్టార్ మా ఛానెల్ రీసెంట్ గా మరో సినిమా ను ఈ క్యాటగిరీ లో సొంతం చేసుకుని ఈ మధ్యే టెలివిజన్ లో టెలికాస్ట్ కూడా చేసి మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ఆ సినిమానే ధనుష్ మరియు కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్ లో 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారి సినిమాను తెలుగు లో మాస్ పేరుతో తర్వాత డబ్ చేసి రిలీజ్ చేశారు. కాగా అప్పటి నుండి సినిమా శాటిలైట్ రైట్స్ అసలు అమ్మకం జరగనే లేదు.

కానీ ఈ సినిమా కి సీక్వెల్ గా వచ్చిన మారి 2 తెలుగు లో మారి గా రిలీజ్ అవ్వగా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి. కానీ మొదటి సినిమా మాత్రం అలానే టెలివిజన్ లో అఫీషియల్ టెలికాస్ట్ కోసం ఎదురు చూడగా రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత ఈ సినిమాను…

ఈ మధ్యే స్టార్ మా ఛానెల్ సుమారు 45 లక్షల రేటు మాత్రమే చెల్లించి హక్కులను సొంతం చేసుకుని టెలివిజన్ లో టెలికాస్ట్ చేసింది, ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు మాస్ సినిమా కి తెలుగు లో 4.42 TRP రేటింగ్ దక్కగా రేటు ప్రకారం చూసుకుంటే అద్బుతమైన రేటింగ్ ను మొదటి సారి సొంతం చేసుకుని ఛానెల్ కొన్న రేటు కి…

మొదటి సారే సాలిడ్ గా న్యాయం చేసింది అని చెప్పాలి. ఈ రేటింగ్ కొన్ని రీసెంట్ బిగ్ మూవీస్ రేటింగ్ లతో పోల్చితే బెటర్ రేటింగ్ గా చెప్పుకోవచ్చు. వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తూ అప్పుడప్పుడు ఇలాంటి రూట్ ని కూడా ఫాలో అవుతూ రేటింగ్స్ పరంగా స్ట్రాంగ్ హోల్డ్ ని కంటిన్యు చేస్తుంది స్టార్ మా ఛానెల్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here