Home గాసిప్స్ దిల్ రాజు కి భారీ షాక్….సాహో తో లాస్ ఎన్ని కోట్లో తెలుసా?

దిల్ రాజు కి భారీ షాక్….సాహో తో లాస్ ఎన్ని కోట్లో తెలుసా?

0

     యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో పై రిలీజ్ కి ముందు ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే, కానీ రిలీజ్ అయిన తర్వాత టాక్ బయటికి ఏ రేంజ్ లో నెగటివ్ గా వచ్చిందో అందరికీ తెలిసిందే, కానీ అప్పటికే జరిగిన వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ మూవీ పై ఉన్న క్రేజ్ తో ఎలా ఉన్నా ఒకసారి చూసి తీరాలి అని ప్రేక్షకులు ఫిక్స్ అవ్వడం తో 4 రోజుల పాటు సాలిడ్ గా కలెక్షన్స్ దక్కాయి.

కానీ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. అన్ని ఏరియాల్లో సినిమా స్లో డౌన్ అవ్వగా ఒక్క హిందీ లోనే సేఫ్ జోన్ లో నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 41 కోట్లకు పైగానే షేర్ ని లాంగ్ రన్ లో రాబట్టాల్సిన అవసరం ఉంది…

ఇక సినిమాను నైజాం అలాగే వైజాగ్ ఏరియాలకు గాను ఏకంగా 55 కోట్ల రేటు ఇచ్చి దిల్ రాజు హక్కులు తీసుకున్నారట. కానీ ఇప్పుడు సినిమా ద్వారా దిల్ రాజు కి ఈ రెండు ఏరియాల్లో ప్రస్తుతానికి అవలీలగా 15 కోట్ల రేంజ్ లో లాస్ కన్ఫాం అని తేలుతుంది.

నైజాం ఏరియాలో 40 కోట్లకు కొనగా సినిమా ఇప్పటి వరకు GST రిటర్న్స్ తో కలిపి 28.85 కోట్లు వెనక్కి తెచ్చింది. లాంగ్ రన్ లో మరో కోటి కోటిన్నర తెచ్చే చాన్స్ ఉంది. ఇక ఉత్తరాంద్ర ఏరియాలో సినిమాను 15 కోట్లకు కొన్నాడు దిల్ రాజు. కాగా ఇప్పటి వరకు సినిమా అక్కడ 9.67 కోట్ల షేర్ ని సాధించింది.

లాంగ్ రన్ లో మరో కోటి కి పైగా వసూల్ చేసే అవకాశం ఉంది, దాంతో ఈ రెండు చోట్ల ప్రస్తుతానికి లాస్ 15 కోట్ల రేంజ్ లో కనిపిస్తున్నా ఫైనల్ రన్ ముగిసే లోపు 14 కోట్ల రేంజ్ లో అయినా లాస్ కన్ఫాం అని అంటున్నారు. దాంతో ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి దిల్ రాజు బ్యానర్ లో చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here