టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కాబోతుంది. రేసులో ఉన్న ఆదిపురుష్ సినిమా తప్పుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే నట సింహం బాలయ్యల వీర సింహా రెడ్డి సినిమాల మధ్య పోటి ఉండబోతుండగా పోటి లో మరో సినిమాగా దిల్ రాజు నిర్మాణం లో వస్తున్న వారసుడు సినిమా కూడా నిలవగా థియేటర్స్ అగ్రిమెంట్స్ ఆ సినిమా కి ఇప్పటి నుండే జరుగుతూ ఉండటం, అది కూడా…..
కొన్ని మేజర్ థియేటర్స్ స్ట్రైట్ తెలుగు మూవీస్ కి కాకుండా ఈ డబ్బింగ్ మూవీ కి అగ్రిమెంట్ లో ఇస్తూ ఉండటంతో రీసెంట్ గా తెలుగు సినిమా కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని దిల్ రాజు ఇది వరకు చెప్పిన మాటలనే మళ్ళీ చెబుతూ శాకిచ్చిందని సమాచారం.
పండగ టైం లో స్ట్రైట్ సినిమాలకు కాకుండా డబ్బింగ్ మూవీస్ కి థియేటర్స్ ఎలా ఇస్తారు అని 2019 టైం లో దిల్ రాజు పేట సినిమా రిలీజ్ కి థియేటర్స్ ఇవ్వలేదు, ఇప్పుడు అదే మాటని చెబుతూ స్ట్రైట్ మూవీస్ ఉన్న టైం లో డబ్బింగ్ మూవీస్ కి థియేటర్స్ ఇవ్వడం కుదరదని, అసలు పండగ టైంలో…
డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవ్వకుండా నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వారసుడు తమిళ్ లో తెరకెక్కి తెలుగు లో డబ్ అవుతున్న సినిమాగా దిల్ రాజు, అలాగే డైరెక్టర్ వంశీ పడిపల్లి ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో వాళ్ళకి ఇప్పుడు ఏం తోచని పరిస్థితి నెలకొంది. మరి దీనిపై దిల్ రాజు అయితే ఇప్పటి వరకు ఓపెన్ గా ఇంకా మాట్లాడాల్సి ఉంది.