కోలివుడ్ తో పాటు ఇప్పుడు టాలీవుడ్ లో సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో దళపతి విజయ్ చేరాడు, సినిమా సినిమాకి తన మార్కెట్ ఇక్కడ భారీగా ఇంప్రూవ్ అవుతూ వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేస్తున్న వారసుడు సినిమా ముందు బైలింగువల్ అనుకున్నా కానీ తర్వాత నిర్మాత దిల్ రాజు అఫీషియల్ గా ఇది తమిళ్ లో రూపొంది…
తెలుగు లో డబ్ అవుతున్న సినిమా అని క్లారిఫై చేయగా అప్పటి నుండి సినిమాను డబ్బింగ్ సినిమా గానే చూస్తున్నారు అందరూ.. రీసెంట్ గా సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగా తమిళ్ లోనే రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ ను కూడా సొంతం చేసుకోగా…
ఇప్పుడు ఈ సినిమా పై తెలుగు లో సోషల్ మీడియా లో గొడవలు జరుగుతున్నాయి. దానికి కారణం సినిమానో లేక హీరోనో కాదు సినిమా నిర్మాత అయిన దిల్ రాజు… ఎఫ్2 రిలీజ్ టైం లో రజినీ పేటకి తెలుగు లో థియేటర్స్ ఇవ్వం అంటూ కామెంట్స్ చేసిన దిల్ రాజు ఇప్పుడు సంక్రాంతికి….
డబ్బింగ్ సినిమా అయినా వారసుడుకి ఎక్కువ థియేటర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లు అగ్రిమెంట్స్ కూడా జరుపుతున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. దాంతో వేరే సినిమాలకు ఒక న్యాయం తన సినిమాలకు ఒక న్యాయం అంటూ వాదనలు సినిమాను తెలుగు లో సంక్రాంతికి రిలీజ్ చేయొద్దు అంటూ గొడవలు జరుగుతున్నాయి. మరి వీటిపై దిల్ రాజు ఎలా స్పందిస్తాడో చూడాలి.