Home న్యూస్ రీ రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ సినిమా…ఏ సినిమా అంటే!!

రీ రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ సినిమా…ఏ సినిమా అంటే!!

0

టాలీవుడ్ లో రీసెంట్ గా రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది, హీరోల పుట్టిన రోజు టైం లో ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వగా తర్వాత నార్మల్ టైం లో కూడా ఓల్డ్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. రీసెంట్ గా త్రివిక్రమ్ పుట్టిన రోజు కానుకగా నువ్వే నువ్వే సినిమాను రీ రిలీజ్ చేయగా ఈ వీక్ లో ప్రభాస్ బర్త్ డే కి…

రీ రిలీజ్ అవ్వాల్సిన వర్షం మూవీ ని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు, వీటితో పాటు ఎలాంటి ఈవెంట్ లాంటివి ఏమి లేకున్నా కానీ ఎన్టీఆర్ నటించిన సినిమా ఒకటి కూడా రీ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. ఆ సినిమానే బాద్ షా…

శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ మూవీగా నిలిచింది, 2013 లో వచ్చిన ఈ సినిమా ను ఇప్పుడు నట్టి కుమార్ ఈ నెల 19న తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయబోతుండగా సుమారు 80 నుండి 100 థియేటర్స్ లో…

ఈ రీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మిగిలిన సినిమాలు అంటే ముందే ప్లాన్ చేసిన సినిమాలు కానీ బాద్ షా అసలు ప్లానింగ్ లోనే లేని సినిమా ను సడెన్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. మరి జనాలకు ఈ రీ రిలీజ్ లు కూడా బోర్ అయ్యేలా చేస్తారేమో అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here