చాలా టైంగా షూటింగ్ ను జరుపుకుంటున్న టాలీవుడ్ మూవీస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ లో చాలా టైంగా వార్తల్లో ఉన్న సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie) అని చెప్పాలి…ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఎప్పటి కప్పుడు…
ఎదో ఒక డిలే వలన ఆగిపోతూ ఉండగా మధ్యలో సినిమానే ఆపేశారు అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.. కానీ వాటికి మేకర్స్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ ఎదో ఒక అప్ డేట్ ని ఇవ్వగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేసి సినిమా ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుందని అనౌన్స్ చేశారు….
కానీ సినిమా టీసర్ వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ చేసిన డైరెక్టర్ క్రిష్ పేరును ఇప్పుడు సినిమా నుండి తొలగించారు….రెండు పార్టులుగా ఉండబోతున్న ఈ సినిమా కి ఇప్పుడు డైరెక్టర్ మారాడు…ఇది వరకు టాలీవుడ్ లో గోపీచంద్ తో ఆక్సీజన్, కిరణ్ అబ్బవరం తో రూల్స్ రంజన్ లాంటి ఫ్లాఫ్ మూవీస్ ని…
డైరెక్ట్ చేసిన జ్యోతి కృష్ణ మిగిలిన సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇంత పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుండి క్రిష్ తప్పుకోవడం, ఆయన ప్లేస్ లో 2 ఫ్లాఫ్స్ కొట్టిన డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండటంతో సినిమా ఔట్ పుట్ ఎలా ఉంటుంది అన్నది అనుమానంగా మారింది…
ఈ ఇయర్ రిలీజ్ కానున్న బిగ్ మూవీస్ లో ఒకటిగా నిలవబోతున్న హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఇలా డైరెక్ట్ చేంజ్ అనే నిర్ణయం ఫ్యాన్స్ ని కొంత కలవరపెడుతున్న విషయం అని చెప్పాలి. ఆల్ రెడీ చాలా కాలంగా షూటింగ్ డిలే అవుతున్న ఈ సినిమాలో ఇలా డైరెక్ట్ చేంజ్ వలన సినిమా ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక….