Home Uncategorized ఖిలాడిని డబుల్ మార్జిన్ తో బీట్ చేసిన డిజే టిల్లు…ట్రేడ్ మైండ్ బ్లాంక్!!

ఖిలాడిని డబుల్ మార్జిన్ తో బీట్ చేసిన డిజే టిల్లు…ట్రేడ్ మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది కానీ నార్త్ సైడ్ హిందీ వర్షన్ ప్రింట్స్ లేట్ గా వెళ్ళగా ఓవర్సీస్ లో డ్రైవ్స్ కూడా లేట్ గా వెళ్ళడంతో చాలా చోట్ల షోలు అసలు అనుకున్న టైం కి కూడా పడలేదు. అక్కడ ప్రమోషన్స్ కూడా అనుకున్న రేంజ్ లో లేక పోవడం లాంటివి….

సినిమా ఓపెనింగ్స్ పై గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ప్రీమియర్ షోలతో 29 వేల డాలర్స్ ని అలాగే మొదటి రోజు అప్ డేట్ అయిన లెక్కల ప్రకారం 15 వేల డాలర్స్ దాకా ఇప్పటి వరకు సాధించగా టోటల్ గా 44 వేల డాలర్స్ ను అందుకుంది….

ఫైనల్ గా ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు కలెక్షన్స్ 50 వేల మార్క్ ని అందుకోవచ్చని అంచనా వేస్తుండగా, ఇదే టైం లో చిన్న సినిమానే అయినా ఎక్స్ లెంట్ ప్రమోషన్స్ అండ్ బజ్ ను సొంతం చేసుకుని పెర్ఫెక్ట్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న డిజే టిల్లు సినిమా మాత్రం….

ప్రీమియర్ షోల నుండే బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ను చూపెట్టి ఖిలాడీ కన్నా కూడా డబుల్ మార్జిన్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా అక్కడ ప్రీమియర్స్ తో ఆల్ రెడీ 1 లక్షకి పైగా డాలర్స్ ని వసూల్ చేసి ఖిలాడి కన్నా కూడా డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. పక్కా ప్లానింగ్ అండ్ బజ్ ఉన్న మూవీ కి వచ్చే ఓపెనింగ్స్….

ఈ విధంగా ఉంటాయి అని చెప్పాలి. అలాంటివి చేయని ఖిలాడి మేకర్స్ ఇప్పుడు ఇలాంటి ఓపెనింగ్స్ కి బాద్యులు అయ్యారు అని చెప్పాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులలో కూడా ఖిలాడి మంచి ఓపెనింగ్స్ నే అందుకుందని చెప్పాలి. ఇక రెండో రోజు డిజే టిల్లు ను తట్టుకుని సినిమా ఎలాంటి వసూళ్ళని సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here