బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ థార్డ్ వేవ్ ఇంపాక్ట్ అండ్ అన్ సీజన్ స్టార్ట్ ఎఫెక్ట్ వలన సినిమాలకు జనాల నుండి ఆదరణ అయితే కరువు అయింది. కానీ ఫిబ్రవరి నెలలో ఆడియన్స్ ముందుకు కొన్ని మంచి అంచనాలు ఉన్న సినిమాలే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా వాటిలో యూత్ ని టార్గెట్ చేసి తీసిన సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డిజే టిల్లు సినిమా చిన్న సినిమానే అయినా….
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హైప్ నడుమ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లు, సాంగ్స్, టీసర్ అలాగే ప్రోమోలు ఇలా అన్నీ కూడా యూత్ ని బాగా అట్రాక్ట్ చేయగా ఆడియన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందని….
ఆశగా ఎదురు చూస్తూ ఉండగా యూత్ అయితే మరీ ఎక్కువగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు…. దాంతో సినిమా పై బజ్ సాలిడ్ గా పెరిగి పోగా అన్ సీజన్ ఎఫెక్ట్ అండ్ థార్డ్ వేవ్ ఇంపాక్ట్ లు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కి బిజినెస్ నెక్స్ట్ లెవల్ మాస్ అనిపించేలా….
ట్రేడ్ వర్గాలు ఆశ్యర్యపోయేలా చేశాయి అని చెప్పాలి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ బిజినెస్ రేంజ్ 7.7 కోట్ల రేంజ్ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రేంజ్ 9 కోట్ల రేంజ్ లో ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. అందులో నైజాంలో 2.8 కోట్లు, సీడెడ్ 1.5 కోట్లు టోటల్ ఆంధ్రలో 3.4 కోట్ల దాకా ఉన్నాయని… ఫైనల్ లెక్క రిలీజ్ టైం కి…
ఇంకా క్లియర్ గా ఉంటుందని అంటున్నారు…. ఈ టైం లో చిన్న సినిమా కి ఈ రేంజ్ లో బజ్ అండ్ బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డీసెంట్ గా ఉందనిపించే టాక్ వస్తే చాలు కలెక్షన్స్ పరంగా యూత్ సినిమా కి సాలిడ్ వసూళ్లు దక్కేలా చేస్తారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు… మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.