ఫిబ్రవరి లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రావడానికి సిద్ధం అవుతున్న సినిమా DJ టిల్లు… చిన్న సినిమానే అయినా కానీ ఆడియన్స్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో అంచనాలను మరింతగా పెంచేసింది. యూత్ అంతా ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా పూర్తీ చేసుకుంది ఈ సినిమా….
కంప్లీట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కి సెన్సార్ వాళ్ళ నుండి U/A సర్టిఫికేట్ సొంతం అవ్వగా సినిమా రన్ టైం కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా 2 గంటల 4 నిమిషాల లెంత్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉంది… ముందు సినిమాను…
ఫిబ్రవరి 11న రిలీజ్ అనుకున్నా కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను 12కి ఫిక్స్ చేసి ప్రమోషన్ పనులను మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. సినిమా కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.