Home న్యూస్ డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

0
Ram Pothineni Double iSmart Movie Business, Theaters Count, Bookings Report and Day 1 Collections Expectations
Ram Pothineni Double iSmart Movie Business, Theaters Count, Bookings Report and Day 1 Collections Expectations

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైములో మాస్ మూవీస్ తో రచ్చ చేస్తున్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) రీసెంట్ మాస్ మూవీస్ ఓపెనింగ్స్ పరంగా కుమ్మేశాయి కానీ ఆశించిన సక్సెస్ అయితే రాలేదు…ఇలాంటి టైంలో తన కెరీర్ బెస్ట్ మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) సినిమా..

గ్రాండ్ గా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 48 కోట్ల బిజినెస్ ను అందుకుని 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రోజున సుమారు 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా సినిమా…

1000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది…ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు అవ్వగా నైజాంలో కొంచం లేట్ గా బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఆంధ్రలో ముందే ఓపెన్ అయ్యి మంచి జోరునే చూపెడుతూ ఉండగా మొత్తం మీద ఆగస్టు 15 వీకెండ్ మూవీస్ లో…

తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ బుకింగ్స్ డబుల్ ఇస్మార్ట్ మూవీకే ఉండగా మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరుని చూపెడుతూ ఉన్నప్పటికీ పోటిలో ఇతర సినిమాలు కూడా ఉన్న నేపధ్యంలో అన్ని సినిమాలను తట్టుకుని డబుల్ ఇస్మార్ట్ ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే…

5-6 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా మాస్ సెంటర్స్ లో మంచి జోరుని చూపించే అవకాశం ఉన్న నేపధ్యంలో టాక్ బాగుండి అన్ని చోట్లా జోరు చూపిస్తే 7-7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని పోటిలో సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి…

మిగిలిన సినిమాల రిపోర్ట్ లను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా అన్ని చోట్లా డబుల్ ఇస్మార్ట్ సినిమా జోరు చూపించే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా ఇక మొదటి రోజు ఈ అంచనాలను అందుకుంటుందో లేక మించి పోతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here