Home న్యూస్ జల్సాని బీట్ చేసిన ఈనగరానికి ఏమైంది…ఇదేం కొట్టుడురా బాబు!!

జల్సాని బీట్ చేసిన ఈనగరానికి ఏమైంది…ఇదేం కొట్టుడురా బాబు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తూ ఉండగా పెద్దగా అంచనాలు లేకుండా రీ రిలీజ్ అయిన చిన్న సినిమా ఈనగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతుంది.

సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని రేంజ్ లో హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపగా తర్వాత రోజుల్లో కూడా ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మాస్ వసూళ్ళని సాధిస్తూ ఇప్పుడు రీ రిలీజ్ మూవీస్ లో…

హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతుంది. సినిమా 4 రోజుల లాంగ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు రీ రిలీజ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ లో ఒకటైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)…

నటించిన జల్సా(Jalsa) సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. జల్సా సినిమా భారీ లెవల్ లో మొదటి రోజే 3.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు 4 రోజుల్లో ఈనగరానికి ఏమైంది సినిమా టోటల్ గా…

3.21 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఇప్పటికీ లిమిటెడ్ షోలతో డీసెంట్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండటంతో రీ రిలీజ్ టోటల్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Ee Nagaraniki Emaindi Re Release Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here