Home న్యూస్ ఈటీ-ఎవ్వరికీ తలవంచకు రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

ఈటీ-ఎవ్వరికీ తలవంచకు రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న సూర్య రీసెంట్ టైం లో సరైన విజయాలు లేక తన మార్కెట్ ని కోల్పోతూ వస్తున్నాడు. రీసెంట్ గా సూర్య నటించిన 2 సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఈటీ ఎవ్వరికీ తల వంచకు ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… లాయర్ అయిన హీరో ఊర్లో కొందరు అమ్మాయిలు అనుమానాస్పదంగా యాక్సిడెంట్ అయ్యి చనిపోతూ ఉంటారు, చిన్నప్పుడే తన అక్కని కోల్పోయిన హీరో ప్రతీ అమ్మాయిని చెల్లెలిగా భావిస్తూ ఉంటాడు. ఇలాంటి టైం లో ఊర్లో ఇలా అమ్మాయిలు చనిపోతూ ఉండటంతో….

హీరో కి అనుమానం రాగా, తర్వాత ఏం జరిగింది, ఈ మిస్టరీ ని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది మొత్తం మీద సినిమా స్టొరీ పాయింట్… సూర్య తన రోల్ లో అద్బుతంగా నటించి మెప్పించాడు, హీరో ఎలివేట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, తన డైలాగ్స్ కూడా బాగా చెప్పి మెప్పించాడు సూర్య…

ఇక ప్రియాంక నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉండగా సత్యరాజ్, శరణ్యల రోల్స్ పర్వాలేదు అనిపించగా విలన్ గా చేసిన వినయ్ రాయ్ ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వరకు బోర్ కొట్టించాయి…

సినిమా ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పట్టగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది, ఇక సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సినిమా పర్వాలేదు అనిపించేలా సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అయినా క్లైమాక్స్ 20 నిమిషాల మెలోడ్రామా మరీ ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది… మొత్తం మీద సీరియస్ స్టొరీ పాయింట్ ని విలేజ్ బ్యాగ్ డ్రాప్ తో…

తమిళ్ ఫ్లేవర్ మరీ ఎక్కువ ఉండటం తో వాళ్ళ వరకు సినిమా బాగుంది అనిపించవచ్చు కానీ మొత్తం మీద తెలుగు ఆడియన్స్ ఇవి భరించడం కొంచం కష్టమే అని చెప్పాలి… హీరోయిజం ఎలివేట్ సీన్స్, సూర్య పెర్ఫార్మెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్ కాగా మెలో డ్రామా ఎక్కువ అవ్వడం, కథ టేక్ ఆఫ్ కి చాలా టైం పట్టడం, తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ అవ్వడం లాంటివి మనకు…

మేజర్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. అయినా కానీ సూర్య కోసం ఓపిక పట్టి చూసి ఈ హెవీ మెలో డ్రామా సెంటి మెంట్ సీన్స్ ని ఓపికతో చూస్తె ఒక సారి చూడొచ్చు అనిపిస్తుంది… మొత్తం మీద సూర్య నుండి మనం ఎక్స్ పెర్ట్ చేస్తున్న సినిమా రేంజ్ అయితే ఇది కాదు అనిపిస్తుంది…. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here