2020 కి గాను రిలీజ్ అయిన సినిమాలే తక్కువ, వాటిలో ఆడియన్స్ ని అలరించిన సినిమాలు మరింత తక్కువ అనే చెప్పాలి. కానీ రిలీజ్ అయ్యి అలరించిన సినిమాల్లో కొన్ని సినిమాలు మాత్రం బాగా ఇంప్రెస్ చేశాయి. అలాంటి సినిమాలలో మలయాళంలో రూపొందిన సినిమా జల్లికట్టు సినిమా కూడా ఒకటి… ఈ సినిమా టాక్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు కానీ కాన్సెప్ట్ పరంగా అలాగే…
టేకింగ్ పరంగా మాత్రం అంచనాలను మించిపోయింది, దానికన్నా ముఖ్యంగా సౌండింగ్ విషయంలో బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో ఇలాంటి సినిమా ఇండియాలోనే ఇప్పటి వరకు రాలేదు అంటూ మెచ్చుకున్నారు, కథ పాయింట్ మనిషిలో ఇప్పటికీ ఆదిమ జాతి మానవుడి…
క్రూరత్వం ఇంకా ఉందని చెప్పే ప్రయత్నమే జల్లికట్టు సినిమా…అడవి దున్నని వేటాడే పనిలో ఒక ఊరు ఊరే మృగాలుగా మారి వేటాడే సీన్స్ ఒకింత షాక్ కి గురి చేస్తాయి. దాంతో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కొందరు బాగుంది అంటూ కొందరు ఇదేమి కాన్సెప్ట్ అంటూ పెదవి విరిచారు.
కానీ ఈ సినిమానే అందరికీ షాక్ ఇస్తూ 2020 ఇయర్ కి గాను ఇండియా నుండి ఆస్కార్ కి సెలెక్ట్ అయిన సినిమాగా నిలిచి షాక్ ఇచ్చింది. పలు విభాగాల్లో సినిమా పోటి లో నిలవడం తో సినిమా ఆస్కార్ రేసులో ఎంటర్ అయినా ఆశ్యర్య పోనవసరం లేదని అంతా భావించారు, కానీ ఆస్కార్ వివిధ కేటగిరిలో పరిశీలించిన సినిమాల్లో ఈ సినిమా ను పక్కకు పెట్టేసి అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది.
దాంతో ఆస్కార్ రేసు నుండి సినిమా అఫీషియల్ గానే పక్కకు తప్పుకున్నట్లు అయింది. దాంతో మరోసారి ఇండియా నుండి హోప్స్ పెట్టుకున్న సినిమా నిరాశ పరిచినట్లు అయింది. కానీ యూనిక్ కాన్సెప్ట్, ఎక్స్ లెంట్ సౌండింగ్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఈ సినిమా ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అని చెప్పాలి..