బాక్స్ అఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అవ్వగా రెండో వారంలో కొత్త సినిమాల జోరు వలన స్లో డౌన్ అవ్వక తప్పలేదు. సినిమా బడ్జెట్ దృశ్యా ఓవరాల్ గా అన్ని బిజినెస్ ను లు కలుపుకుని సినిమా యూనిట్ కి ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉండొచ్చు…
ట్రేడ్ లెక్కల ప్రకారం ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా యూనిట్ మాత్రం ప్రతీ రోజు కొత్త పోస్టర్స్ లో కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తున్నారు…
రీసెంట్ గా సినిమా యూనిట్ సినిమా 9 రోజుల్లో 102 కోట్లు వచ్చాయి అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక సినిమా 10వ రోజు ఆదివారం మొత్తం మీద 2.85 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంటే మేకర్స్ ఏకంగా 110 కోట్ల మార్క్ ని 10 రోజుల్లో అందుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు… దాంతో ఈ పోస్టర్స్ చూసి ట్రేడ్ కి…
మైండ్ బ్లాంక్ అయినట్లు అయింది. ఇక మొత్తం మీద సినిమా ట్రేడ్ లెక్కల్లో 10 రోజుల్లో 86 నుండి 87 కోట్ల రేంజ్ లో గ్రాస్ వచ్చిందని లెక్కలు చెబుతుంటే పోస్టర్స్ లో ఏకంగా 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ పోస్టర్స్ ని వదిలారు… కానీ 10 వ రోజు ఏకంగా 8 కోట్లు రావడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో కూడా నెగటివ్ కామెంట్స్ సినిమా పై వస్తున్నాయి….
ఇలాంటి పోస్టర్స్ పబ్లిసిటీ ఎప్పటి నుండో టాలీవుడ్ లో ఉంది, వచ్చిన కలెక్షన్స్ కన్నా కూడా పోస్టర్స్ లో కలెక్షన్స్ లెక్కకు మించి వేయడం, ఫ్యాన్స్ అవి నిజం అనుకోవడం తర్వాత ఆయా ఏరియాల ట్రాకర్స్ వేసే లెక్కలు డిఫెరెంట్ గా ఉండటంతో పోస్టర్స్ నిజం అనుకుని ఫ్యాన్ వార్స్ చేయడం కామన్ గా జరుగుతుంది. ఇలా హైప్ పోస్టర్స్ వలన కొన్ని సినిమాలు ఆక్చువల్ కలెక్షన్స్ పోస్టర్స్ వదిలినా వాటిని కూడా ఫేక్ అనుకుంటున్నారు….