బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి కామెడీ ఎంటర్ టైనర్స ని ఇష్టపడే వాళ్ళ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుంది కానీ ఇలాంటి కామెడీ మూవీస్ ని చూసి చూసి ఉన్న వాళ్ళకి మాత్రం ఎఫ్3 అంతగా ఎక్కలేదు… సోషల్ మీడియాలో సినిమా ను క్రింజ్ కామెడీ అంటూ కామెంట్స్ చేశారు….
కానీ అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో 4 రోజుల్లో ఆల్ మోస్ట్ 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము దులిపేసింది, మరో పక్క అమెరికాలో సినిమా 1 మిలియన్ మార్క్ ని అందుకుని అక్కడ కూడా సంచలనం సృష్టించింది ఈ సినిమా.
ఇక టోటల్ ఓవర్సీస్ లో సినిమా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని దుమ్ము లేపగా క్రింజ్ కామెడీ అన్నా కూడా ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…