Home న్యూస్ F3 మూవీ రివ్యూ….నో లాజిక్…ఓన్లీ మ్యాజిక్!!

F3 మూవీ రివ్యూ….నో లాజిక్…ఓన్లీ మ్యాజిక్!!

0

మూడేళ్ళ క్రితం సంక్రాంతి కి వచ్చిన ఎఫ్2 సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, ఆ సినిమా కి సీక్వెల్ అయినా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా మొదటి పార్ట్ లా ఆకట్టు కుంటుందా లేదా అన్న ఆసక్తితో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఎఫ్ 3 సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో లేదో తెలుసు కుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

బిగ్ బిజినెస్ మాన్ అయిన మురళి శర్మ తన ఆసక్తికి వారసున్ని వెతుకుతూ ఉంటాడు, ఇలాంటి టైం లో డబ్బు కోసం కష్టపడుతున్న వెంకటేష్, వరుణ్ తేజ్ లు, తమన్నా, మేహరీన్ ల ఫ్యామిలీలు ఎంటర్ అయ్యి ఏం చేశారు అన్నది సినిమా కథ…. కథ పరంగా చాలా రొటీన్ స్టొరీ పాయింట్…

కానీ ఇక్కడ ముందే చెప్పినట్లు లాజిక్స్ లాంటివి ఏమి పట్టించుకోకుండా ఉంటే సినిమా మొదటి 20 నిముషాలు కొంచం స్లో గా స్టార్ట్ అయినా తర్వాత అక్కడక్కడా హిలేరియస్ కామెడీతో సినిమా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది, తర్వాత ఇంటర్వెల్ జస్ట్ ఓకే అనిపించినా సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం కొంచం ఓవర్ ది టాప్ సీన్ తో…

కొనసాగినా కానీ కామెడీ విషయంలో మాత్రం సినిమా ఫుల్ పైసా వసూల్ అని చెప్పాలి. వెంకటేష్ తన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్ తో అందరి కన్నా ఎక్కువ మార్కులు కొట్టేయగా వరుణ్ తేజ్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు, ఇక సునీల్ చాలా టైం తర్వాత తన కామెడీతో ఆకట్టుకోగా తమన్నా, మేహరీన్ లు కొంచం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపించినా…

ఆ పాత్రలు అలానే డిసైన్ చేయడంతో అవి కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇక రఘుబాబు, మురళి శర్మ మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు, సాంగ్స్ యావరేజ్ గా ఉండగా సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ కామెడీ పరంగా సూపర్ సక్సెస్ అయినా…

కథ పరంగా ఏమి లేదనే చెప్పాలి. ముందే చెప్పినట్లు ఎలాంటి లాజిక్స్ పట్టించుకోకుండా జస్ట్ అలా అలా స్క్రీన్ పై వచ్చే కామెడీ సీన్స్ తో జనాలను ఎంతవరకు నవ్వించాలో అంతకుమించే నవ్వించాడు అనిల్ రావిపూడి…. ఎఫ్2 తర్వాత ఈ ఫ్రాంచేజ్ లో ఆడియన్స్ ఏం ఎక్స్ పెర్ట్ చేస్తారో అవి మాత్రం మరోసారి అదే రేంజ్ లో జోడించాడు అనిల్ రావిపూడి….

మొత్తం మీద ఓ అద్బుతమైన కథ ఉండాలి, ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి సినిమా పరమ రొటీన్ గా అనిపించవచ్చు కానీ, ఎలాంటి లాజిక్స్ పట్టించుకోకుండా ఓ మంచి ఎంటర్ టైనర్ కావాలి అనుకున్న వాళ్ళు కొన్ని సీన్స్ బోర్ కొట్టినా ఓవరాల్ గా పైసా వసూల్ అనిపించేలా మెప్పిస్తుంది ఎఫ్ 3 మూవీ…సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here